Kiran Abbavaram KA : దీపావళి హిట్టు సినిమా కిరణ్ అబ్బవరం ‘క’.. మలయాళంలో రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా క సినిమా మలయాళం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.
- By News Desk Published Date - 10:25 AM, Wed - 13 November 24

Kiran Abbavaram KA : కిరణ్ అబ్బవరం ఇటీవల దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క సినిమా ఆల్మోస్ట్ 42 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. త్వరలో 50 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. గతంలో వరుసగా పలు ఫ్లాప్స్ చూసిన కిరణ్ అబ్బవరం భారీ బడ్జెట్ తో వచ్చి క సినిమాతో భారీ హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
క సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది. ముందే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని భావించినా వేరే భాషల్లో థియేటర్స్ దొరకకపోవడంతో ఆలస్యమైంది. తాజాగా క సినిమా మలయాళం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. కిరణ్ అబ్బవరం క సినిమా మలయాళంలో నవంబర్ 22 న రిలీజ్ కానుంది. ఈ సినిమాను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కేరళలో రిలీజ్ చేయడం గమనార్హం.
త్వరలోనే క మలయాళం ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో క సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీకి రాదని కూడా మూవీ యూనిట్ ప్రకటించారు.
Also Read : Prabhas – Anushka : అనుష్కను కలిసిన ప్రభాస్..? షూటింగ్ సెట్స్ కు వెళ్లి మరీ..