Telangana High Court : పుష్ప-2 రిలీజ్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
Telangana High Court : పిటిషన్‌లో "బెనిఫిట్ షోల" పేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది
- Author : Sudheer
Date : 03-12-2024 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప-2 సినిమా టికెట్ ధరల (Pushpa 2 Ticket Price) పెంపుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌లో “బెనిఫిట్ షోల” పేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. కానీ, హైకోర్టు సినిమా విడుదలను ఆపలేమని స్పష్టం చేసింది. 2024 డిసెంబర్ 5న ‘పుష్ప-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇప్పుడేం చేయలేమని స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ‘పుష్ప-2’ సినిమా విడుదలను ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగించాలని స్పష్టం చేసింది. సినిమా విడుదల పై ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది. ఈ తీర్పుతో సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. ప్యాన్ ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా విడుదల అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు లేవలేని క్లారిటీ వచ్చేసింది. రెండు రోజులుగా కోర్ట్ ఇలాంటి తీర్పు ఇస్తుందో..? టికెట్ ధరలు తగ్గించమని అంటుందో..? బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరిస్తుందో అని అభిమానులు , మేకర్స్ ఖంగారుపడ్డారు కానీ ఇప్పుడు కోర్ట్ తీర్పు తో ఊపిరి పీల్చుకున్నారు.
పుష్ప 2 తెలంగాణ టికెట్ ధరలు చూస్తే..
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేటర్‌లలో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 05 నుంచి 08 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది.
Read Also : Mulugu Encounter Case: ములుగు ఎన్‌కౌంటర్ కేసు.. మల్లయ్య డెడ్‌బాడీని భద్రపర్చండి.. హైకోర్టు ఆదేశాలు