Keerti Suresh : కీర్తి డ్యాషింగ్ లుక్స్ చూశారా.. అభినయంలోనే కాదు అందంలో కూడా టాపే..!
Keerti Suresh మహానటి కీర్తి సురేష్ ఏం చేసినా సరే ఆమె ఫ్యాన్స్ అంతా ఇట్టే ఇష్టపడతారు. కెరీర్ మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడు స్లిమ్ గా మారి అందరినీ సర్ ప్రైజ్
- By Ramesh Published Date - 10:21 PM, Fri - 16 February 24

Keerti Suresh మహానటి కీర్తి సురేష్ ఏం చేసినా సరే ఆమె ఫ్యాన్స్ అంతా ఇట్టే ఇష్టపడతారు. కెరీర్ మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడు స్లిమ్ గా మారి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఐతే తను చేసినా సరే తన నటనతో మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సూపర్ ఫాం కొనసాగిస్తున్న కీర్తి సురేష్ లేటెస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది.
ఓ పక్క సినిమాలతో అలరిస్తూనే ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు అదరగొట్టేస్తుంది. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ చూసి వావ్ అనేస్తున్నారు ఆమె ఫాలోవర్స్. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ శరీలో తన ఓర చూపులతో ఎట్రాక్ట్ చేస్తుంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ డ్యాషింగ్ లుక్స్ ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి.
తెలుగులో దసరా తర్వాత మరో ఆఫర్ అందుకోని కీర్తి సురేష్ శర్వానంద్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్. కెరీర్ లో ఆఫర్ల సంగతి ఎలా ఉన్నా ఇలా ఫోటో షూట్స్ తో మాత్రం అమ్మడు ఎక్కడ తగ్గనంటూ అదరగొడుతుంది. కీర్తి సురేష్ లేటెస్ట్ శారీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగులో స్టార్ ఛాన్స్ లు రాకున్నా వచ్చిన అవకాశాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది మహానటి.