HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Keerthy Suresh New Movie Raghu Thatha Under Hombale Fims

Keerthy Suresh: పాన్ ఇండియా నిర్మాతలతో కీర్తి సురేష్ సినిమా.. టైటిల్ అదిరిపోయిందిగా?

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగుతోపాటు తమిళ

  • Author : Anshu Date : 04-12-2022 - 6:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keerthy Suresh
Keerthy Suresh

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగుతోపాటు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలో నటిస్తూనే మరొకవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ఈమె తెలుగులో నాని నటిస్తున్న దసరా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కొత్త మూవీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ముదుగుమ్మ కీర్తి సురేష్ ఏకంగా కేజీఎఫ్,కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన హోంబలే నిర్మాణ సంస్థలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతోంది. ఆ సినిమా రగ్ తాథా పేరుతో రూపొందనుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తున్న తొలి త‌మిళ చిత్రం కూడా ఇదే కావ‌టం గ‌మ‌నార్హం. కాగా ఇప్పటికే తెలుగులో హోంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

హోంబలే నిర్మాణ సంస్థ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తోంది. రగ్ తాథా అనే ప‌దానికి అర్థం ఏంటి అన్న విషయానికి వస్తే.. హిందీలో ఉండే ర‌హ్ తాథా అనే పదాన్ని త‌మిళులు కొంద‌రు ర‌గ్ తాథా అని సంబోధిస్తుంటారు. ఆ యాంగిల్‌లోనే ఈ టైటిల్‌ను పెట్టి ఉండ‌వ‌చ్చున‌ని మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ఈ డిఫ‌రెంట్ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం సినిమాను ఏమైనా సెటిరిక‌ల్ కామెడీగా తెర‌కెక్కించ‌బోతున్నారా నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hombale fims
  • keerthy suresh
  • Kollywood
  • new movie
  • raghu thatha

Related News

Vijay Deverakonda Rowdy Janardhana Movie

Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

A man who fights the world… but surrenders only to love ❤️ Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH — Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం […]

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd