Katrina Kaif: కత్రినా కైఫ్ కు ప్రెగ్నెన్సీ అంటూ మళ్లీ గాసిప్స్.. ఇందులో నిజమేంతంటే?
బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో
- By Nakshatra Published Date - 07:30 AM, Wed - 13 July 22
బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ప్రేమ జంట గత ఏడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ ఇద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. ఈ జంట కెరిర్ పరంగా ఎంత బిజీ బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆలియా భట్ ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత కత్రినా కైఫ్ కూడా గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆ విషయంపై అటు విక్కీ కౌశల్ కానీ ఇటు కత్రినా కైఫ్ గాని స్పందించలేదు. అయితే కత్రినా కైఫ్ గర్భవతి అయింది ఈ వార్త నిజమే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎందుకు సంబంధించిన విషయాన్ని జూలై 16వ తేదీన కత్రినా కైఫ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించవచ్చు అని ఆమె సన్నిహితులుగా ఉన్న ఒకరు తెలిపారట.
ఈ మధ్యకాలంలో కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ అక్కడ కనిపించడం లేదు. అందుకు ఆమె ప్రెగ్నెన్సీనే కారణమని కొంతమంది భావిస్తున్నారు. కాగా కత్రినా కైఫ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ 7 షో నుండి కూడా తప్పుకుందట. కాగా ఇటీవల బాలీవుడ్ కరణ్ జోహార్ 50 పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు హాజరైన కత్రినా కైఫ్ ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించలేదు. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అని, ఇదే విషయాన్ని ఆమె త్వరలోనే ఆమె పుట్టినరోజు సందర్భంగా వెల్లడించనుంది అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ విషయాలలో నిజానిజాలు తెలియాలి అంటే కత్రినా కైఫ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.
Related News
Rakul Preet Singh : సమ్మర్ వేడి మరింత పెంచుతున్న అమ్మడు.. పెళ్లైనా తగ్గేదేలే..!
Rakul Preet Singh తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిన రకుల్ బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది. ఈమధ్యనే అమ్మడు తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానిని పెళ్లాడిన విషయం తెలిసిందే.