Poonam Pandey: పూనమ్ పాండే మరణ వార్తపై స్పందించిన కస్తూరి శంకర్.. నిజంగా సిగ్గుచేటు అంటూ?
బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే పేరు గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఆమె చనిపోయింది అంటూ నకిలీ వా
- By Anshu Published Date - 08:00 AM, Mon - 5 February 24

బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే పేరు గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఆమె చనిపోయింది అంటూ నకిలీ వార్తలు సృష్టించి సంచలనంగా మారింది. తనకు తానుగా ఆమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. దీంతో పూనమ్ మరణంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె సడన్ గా చనిపోవడం ఏంటి అని అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీలు షాక్ అయ్యారు. అందరూ ఆ షాక్ లో ఉండగా మరుసటి రోజు తాను మరణించలేదని ఇంకా బతికే ఉన్నాను అంటూ పూనమ్ మరొక వీడియోని షేర్ చేసి మరొక షాక్ ఇచ్చింది.
దాంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమర్శలు గుప్పించారు. పబ్లిసిటి కోసమే ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు నకిలీ వార్తలను పోస్ట్ చేసినందుకు పూనమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూనమ్ పాండే నకిలీ మరణంపై పలువురు సినీ తారలు స్పందిస్తూ.. ఆమె ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి కస్తూరి శంకర్ పూనమ్ పోస్ట్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మేరకు కస్తూరి శంకర్ ఆ కామెంట్స్ పై స్పందిస్తూ.. తన వయస్సు 32 సంవత్సరాలు అని చెప్పినప్పుడే నాకు అర్ధమైంది. అది ఫేక్ న్యూస్ అని, అది కేవలం పబ్లిసిటి స్టంట్ అని, ఎందుకంటే ప్రజలకు సర్వైకల్ క్యానర్ గురించి పూర్తిగా తెలుసు.
The minute they mentioned her age as 32 I knew it must be fake news.
The irony is that cervical cancer was and is much more well known than Poonam Pandey ever was and will be. What an attention whore. Using cancer for a publicity gimmick…shameful and shocking. pic.twitter.com/oKbPYFPrn7— Kasturi (@KasthuriShankar) February 3, 2024
దానికి కారణంగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసు. కానీ పూనమ్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తెలిసింది. క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగించడం అన్నది నిజంగా సిగ్గుచేటు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారు మేడం ఇలాంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి అంటూ మంది పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనేది పూనమ్ పాండే ఆలోచన అయినప్పటికీ, ఆమె చనిపోయిందని తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వల్ల విమర్శలను ఎదుర్కొంటోంది.