Kasthuri : నటి కస్తూరికి బెయిల్ మంజూరు
Kasthuri : తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ ఉందని వివరించారు. ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించిన కస్తూరి.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు
- By Sudheer Published Date - 10:50 AM, Thu - 21 November 24

తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి (Kasthuri)కి కోర్ట్ బెయిల్ (Bail) మంజూరు చేసింది. కొద్దీ రోజుల క్రితం బీజేపీ (BJP)సమావేశంలో కస్తూరి మాట్లాడుతూ.. రాజీలు, మహరాజుల కాలంలో తెలుగువారు.. అంతఃపురంలో మహిళలకు సేవకులుగా పనిచేసేందుకు తమిళనాడుకు వచ్చారని కీలక వ్యాఖ్యలు చేసింది.అధికారిక డీఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కస్తూరిపై తమిళనాడులోని తెలుగు సంఘాలు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో, ఆమెపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో చెన్నై పోలీసులు హైదరాబాద్ లో ఆమెను అదుపులోకి తీసుకోని కోర్ట్ లో హాజరు పరచగా..కోర్ట్ రిమాండ్ విధించింది.
ఈ క్రమంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి దయాళన్ బుధవారం విచారణ చేపట్టారు. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ ఉందని వివరించారు. ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించిన కస్తూరి.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, పోలీసుల తరఫున అభ్యంతరం తెలపకపోవడంతో ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.
Read Also : High Court Bench : రాయలసీమకు గుడ్ న్యూస్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ !