Kantara Highest Grossing: కర్ణాటకలో ‘కాంతార’ జోరు.. కేజీఎఫ్-2 రికార్డులు బద్దలు!
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా పలు రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.
- By Balu J Published Date - 12:06 PM, Wed - 30 November 22
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా పలు రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఇంతకుముందు రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపి, అత్యధిక వసూళ్లు సాధించిన కేజీఎఫ్-2 రికార్డులను సైతం అధిగమించి చరిత్ర సృష్టించింది. సినిమా క్రిటిక్స్ ప్రకారం.. నిన్నటి వరకు కాంతార మూవీ రూ. 172 కోట్లు రాబట్టింది. దీంతో అంతకుముందున్న కేజీఎఫ్ (రూ.161.50 కోట్లు)ను బ్రేక్ చేసింది. అంతేకాకుండా బాహుబలి -2, విక్రమ్, గాడ్ ఫాదర్ సినిమా రికార్డులను బద్దలుకొట్టి సంచలనాలు నమోదు చేస్తోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో కర్ణాటకలో KGF 2 నెలకొల్పిన రికార్డులను ఏ సినిమా కూడా బ్రేక్ చేయదు అని భావించారు కన్నడ ప్రేక్షకులు. కానీ కాంతార మూవీ చిన్న సినిమాగా విడుదలై, తక్కువ వ్యవధిలోనూ అదిరిపొయే వసూళ్లను సాధించి ఆశ్చర్యపర్చింది. కాంతార దాదాపు 95 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోతే, ‘కేజీఎఫ్ 2’ 72 లక్షల టికెట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. కాంతార, కేజీఎఫ్ కు 3ంశాతం తేడా ఉంది. రెండూ సినిమాలు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదలై, రాష్ట్రంలో ఆల్ టైమ్ గ్రాసర్స్ గా నిలిచాయి. కాగా ఇప్పటివరకు కాంతార ఆల్ ఇండియా కలెక్షన్స్ రూ. 400 కోట్లు కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Related News
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.