Kantara Beats KGF 2: రూ. 400 కోట్లకు చేరువలో కాంతార మూవీ..!
కన్నడ మూవీ కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.
- By Gopichand Published Date - 01:36 PM, Fri - 11 November 22
కన్నడ మూవీ కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో బ్లాక్ బ్లస్టర్ సాధించిన మూవీ ఇది. బాహుబలి 2, RRR, KGF 2 సినిమాలు అత్యంత భారీ విజయాలు అందుకున్నా.. వీటి బడ్జెట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కానీ.. కాంతార మూవీ సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు చెరువవుతుంది. ఈ మూవీ ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 360 కోట్లతో రన్ అవుతోంది.
అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ 40 రోజుల్లో రూ. 350 కోట్ల బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400 కోట్ల గ్రాస్ సాధించే అవకాశముంది. కాంతార మూవీ భారతదేశంలో రూ. 275 కోట్లకు పైగా రన్ అవుతుండగా అందులో దాదాపు రూ. 173 కోట్లు ఒక్క కర్ణాటక నుంచే ఉన్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా ఉంది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ త్వరలో KGF 2 మూవీని అధిగమించే ఛాన్స్ ఉంది. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF 2 చిత్రం కర్నాటకలో అత్యధికంగా రూ.182 కోట్లను రాబట్టింది.
కాంతారను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల్లో కాంతారనే అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదు చేసుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కౌంట్ కోటి రూపాయల దాకా ఉందట. కెజిఎఫ్ 1 ఫుల్ రన్ లో 75 లక్షలు, కెజిఎఫ్ 2 ఫైనల్ ఫిగర్ 72 లక్షలు ఉండగా కోళ నృత్యంతో రిషబ్ శెట్టి చేసిన మేజిక్ వాటిని పెద్ద మార్జిన్ తో దాటేసింది. ఇదిలా ఉంటే కాంతార హిందీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడుతోంది. ఈ చిత్రం 28 రోజుల టిక్కెట్ విండోలో సుమారు 70 కోట్ల నెట్ వసూలు చేసింది. వచ్చే వారం అజయ్ దేవగన్ దృశ్యం 2, వరుణ్ ధావన్ భేదియా విడుదలయ్యేలోపు రూ. 100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Tags
Related News
NTR Prabhas : ఎన్టీఆర్ ప్రభాస్ మధ్యలో యష్..!
NTR Prabhas కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన దర్శకుడు ప్రశాంత నీల్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్లు కొడుతున్నాడు. యష్ హీరోగా కేజిఎఫ్ పార్ట్ 1, 2 సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న