Kantara 2 Collections : ‘కాంతార ఛాప్టర్-1’.. కలెక్షన్లు ఎంతంటే?
Kantara 2 Collections : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మూడురోజులకే దేశవ్యాప్తంగా రూ.170 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ఈ చిత్రానికి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను చూపిస్తుంది
- By Sudheer Published Date - 07:07 PM, Sun - 5 October 25

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మూడురోజులకే దేశవ్యాప్తంగా రూ.170 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ఈ చిత్రానికి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను చూపిస్తుంది. నిన్న ఒక్కరోజే రూ.55 కోట్ల గ్రాస్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థాయిలో వసూళ్లు రావడం కాంతార సిరీస్‌కి ఉన్న బ్రాండ్ విలువను మరింత పెంచింది.
Super Star Rajanikanth : రజినీ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన నిల్చొని భోజనం!
ప్రేక్షకులు ‘కాంతార’ తొలి భాగానికి చూపిన ఆదరణను ఈ సీక్వెల్ కూడా అందుకుంటోంది. రిషబ్ శెట్టి తన దర్శకత్వ నైపుణ్యంతో పాటు నటుడిగా కూడా మరోసారి తన ప్రతిభను రుజువు చేసుకున్నారు. లోకల్ కల్చర్, పౌరాణికత, యాక్షన్ అంశాలను సమ్మిళితం చేసి రూపొందించిన ఈ కథ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సౌండ్ డిజైన్, విజువల్స్, మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్లుగా మారాయి.
ఇవాళ ఆదివారం కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రుక్మిణి వసంత్, జయరామ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించడం సినిమాకి మరింత బలం చేకూర్చింది. మొదటి వీకెండ్ ముగిసే సరికి రికార్డు స్థాయి వసూళ్లు సాధించి కాంతార ఛాప్టర్-1 మరోసారి సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ హవాను చాటే అవకాశం ఉంది.