Suriya : కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన సూర్య తనయుడు.. పుత్రోత్సాహంతో తండ్రి..
పుత్రోత్సాహంతో హీరో సూర్య. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన కొడుకుని చూసి..
- Author : News Desk
Date : 21-04-2024 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగా కంగువ సినిమా చేస్తున్న సూర్య.. నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. కాగా సూర్యకి ఇద్దరు పిల్లలు అన్న విషయం అందరికి తెలిసిందే. కూతురు ‘దియా’, కొడుకు ‘దేవ్’. అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన విషయాలను సూర్య అండ్ జ్యోతిక లో ప్రొఫైల్ లో మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంటారు.
అయితే ఆ ఇద్దరి వారసులకు సంబంధించిన విషయాలు ఎలాగోలా బయటకి వస్తుంటాయి. తాజాగా దేవ్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దేవ్ కరాటే విద్యలో శిక్షణ తీసుకుంటూ వస్తున్నాడట. తాజాగా ఈ శిక్షణలో దేవ్ బల్క్ బెల్ట్ ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య వెళ్లారు. అక్కడ కొడుకుతో పాటు బ్లాక్ బెల్ట్ అందుకున్న ఇతర స్టూడెంట్స్ ని కూడా సూర్య అభినందించారు.
ఇక తన కొడుకుని అభినందిస్తునప్పుడు.. సూర్య కళ్ళలో ఆనందం చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ప్రౌడ్ ఫాదర్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
.@Suriya_offl son #Dev got Black Belt in karate 🥋… 🥹
Proud Father ❤️#DevSuriya #Kanguva #Suriya44 pic.twitter.com/sSjAY3VvBF
— Filmy Bowl (@FilmyBowl) April 21, 2024
కంగువ సినిమా విషయానికి వస్తే.. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. శివ ఈ సినిమానీవు డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందట. ఈ ఏడాదిలోనే ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also read : Aavesham : వంద కోట్ల మార్క్ వైపు మరో మలయాళం సినిమా.. బాలయ్య రీమేక్ చేయాలంటూ..