Kangana Ranaut : ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం
Kangana Ranaut : కంగనా తన అమ్మమ్మ జీవితాన్ని ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటూ, ఆమె వయసు 100 సంవత్సరాలు అని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు వెల్లడించారు
- By Sudheer Published Date - 09:22 PM, Sat - 9 November 24

కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ ( Grandmother dies) ఇంద్రాణి ఠాకూర్ (Indrani Thakur) కన్నుమూసారు. ఈ విషయాన్ని కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ ఒక అద్భుతమైన మహిళ అని, ఐదుగురు సంతానాన్ని పెంచుతూ వారి విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేసినట్టు కంగనా చెప్పుకొచ్చింది. కంగనా తన అమ్మమ్మ జీవితాన్ని ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటూ, ఆమె వయసు 100 సంవత్సరాలు అని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించినట్లు వెల్లడించారు.
కంగనా రనౌత్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ, రాజకీయాలపై కూడా ఆసక్తి చూపుతూ, వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. తన మద్దతుదారులను కలుపుకుని కొన్ని కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలిచిన కంగనా, ముఖ్యంగా రైతు సంఘాలపై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేపారు. ఆమె వ్యాఖ్యలకు విపక్షాలతో పాటు రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి, దీనిపై ఆమె క్షమాపణ కూడా కోరారు. కంగనా తన రాజకీయ జీవితంలోనూ, సినిమాల వైపు దృష్టి సారిస్తూ, తన డైరెక్షన్‌లో రూపొందిస్తున్న “ఎమర్జెన్సీ” సినిమాను త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Read Also : Aghori Naga Sadhu : కారు నుంచి జారిపడ్డ అఘోరి నాగ సాధు