Aghori Naga Sadhu : కారు నుంచి జారిపడ్డ అఘోరి నాగ సాధు
Aghori Naga Sadhu : నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం మెడికల్ కళాశాలకు సమీపంలో బలపనూరు మెట్ట వద్ద డోర్ తెరుచుకుని ప్రమాదవశాత్తు నంద్యాల - కర్నూలు ప్రధాన రహదారి పక్కన పడిపోయింది
- By Sudheer Published Date - 08:33 PM, Sat - 9 November 24

లేడి అఘోరి నాగ సాధు ను వరుస ప్రమాదాలు వెంటాడుతుండడం ఆమె భక్తులను కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న ఆమె ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురికాగా..ఈరోజు కారు నుండి ఆమె కిందకు పడిపోయింది. గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో హల్చల్ చేసిన మహిళా అఘోరి (Naga Sadhu)..ఇప్పుడు తన మకాంను ఏపీకి మార్చింది. తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేసింది. ఇదే క్రమంలో పలు మీడియా చానెల్స్ కు వరుస ఇంటర్వ్యూ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈమె ఏపీలో తిరుగుతూ కనిపిస్తుంది. శ్రీశైలం, వైజాగ్ వంటి ప్రదేశాల్లోతిరుగుతూ ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ క్రమంలో నేడు నంద్యాల సమీపంలోని మహానంది క్షేత్రాన్ని దర్శించుకుని యాగంటి క్షేత్రానికి బయలుదేరింది. ఈ క్రమంలో నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం మెడికల్ కళాశాలకు సమీపంలో బలపనూరు మెట్ట వద్ద డోర్ తెరుచుకుని ప్రమాదవశాత్తు నంద్యాల – కర్నూలు ప్రధాన రహదారి పక్కన పడిపోయింది. గమనించిన స్థానికులు, పోలీసులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె యాగంటికి వెళ్లాలని అక్కడే కూర్చుంది.
Read Also : KCR : ఆగం కాకండి ప్రజలారా.. మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే – కేసీఆర్