Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- Author : Balu J
Date : 23-01-2024 - 1:34 IST
Published By : Hashtagu Telugu Desk
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీలో భారత ప్రథమ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపిస్తోంది. టైటిల్ సూచించినట్లుగా ఈ చిత్రం ఇందిరా గాంధీ పాలనలో 1975 నుండి 1977 వరకు కొనసాగిన “ఇండియన్ ఎమర్జెన్సీ” ఆధారంగా రూపొందించబడింది. ఈ కాలంలో పౌరహక్కులు సస్పెండ్ చేయబడ్డాయి. ఇందిరా గాంధీ వ్యతిరేకులను అరెస్టు చేశారు. పత్రికా సెన్సార్‌లు ఈ కాలంలో జరిగాయి.
అనేక వాయిదాల తర్వాత, సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసింది. ఎమర్జెన్సీ ఇప్పుడు 14 జూన్ 2024న సినిమాల్లోకి వస్తుంది. విడుదల తేదీతో పాటు, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. కంగనా రనౌత్ ఎమర్జెన్సీకి దర్శకురాలు. కథ రచయిత కూడా.
ఎమర్జెన్సీలో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ మరియు విశాక్ నాయర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది.