HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kamal Haasan Indian 2 Postpone Is Problem For Ram Charan Game Changer

Indian 2 : ఇండియన్ 2 మళ్ళీ వాయిదా.. ‘గేమ్ ఛేంజర్’కి ఇబ్బంది..

ఇండియన్ 2 మళ్ళీ వాయిదా పడుతుందట. ఒకవేళ గేమ్ ఛేంజర్ కూడా వాయిదా వేయాల్సి వస్తే.. ఈ ఏడాది రిలీజ్ చేయడం కష్టం.

  • By News Desk Published Date - 10:37 AM, Sun - 5 May 24
  • daily-hunt
Kamal Haasan Indian 2 Postpone Is Problem For Ram Charan Game Changer
Kamal Haasan Indian 2 Postpone Is Problem For Ram Charan Game Changer

Indian 2 : దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి తమ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా తీసుకు వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 2019లోనే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. పలు కారణాలు వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అది మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియక.. శంకర్, రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేసారు. అయితే అది మొదలుపెట్టిన తరువాత ఇండియన్ 2 కి ఉన్న ఇబ్బందులు అన్ని తొలిగిపోయాయి.

దీంతో శంకర్ ఆ సినిమా షూటింగ్ ని కూడా చేయాల్సి వచ్చింది. ఇక చేసేది లేక కొన్ని రోజులు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ కొన్ని రోజులు షూటింగ్ ని జరుపుతూ వచ్చారు. అయితే ఆ తరువాత ఇండియన్ 2 రెండు పార్టులుగా తీసుకు రావాలని నిర్ణయం తీసుకోవడంతో.. గేమ్ ఛేంజర్ మరింత లేట్ అయ్యింది. ఇండియన్ 2 సినిమా రిలీజ్ తరువాతే గేమ్ ఛేంజర్ ని శంకర్ రిలీజ్ చేయనున్నారు. కేవలం రిలీజ్ మాత్రమే కాదు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కూడా ఇండియన్ 2 రిలీజ్ తరువాతే చేయనున్నారు. ఈ నిర్ణయంతో గేమ్ ఛేంజర్ కి బాగా ఇబ్బంది అయ్యిపోయింది.

కాగా ఇటీవల ఇండియన్ 2ని జూన్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ వార్త చూసి కమల్ హాసన్ ఫ్యాన్స్ కంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ సంబరపడ్డారు. ఇండియన్ 2 రిలీజ్ అయ్యిపోతే గేమ్ ఛేంజర్ కి ఒక ఇబ్బంది తీరిపోతుందని. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఇండియన్ 2 మళ్ళీ వాయిదా పడుతుందట. ఈ సినిమా జూన్ నుంచి తప్పుకొని, కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తుందట. ప్రస్తుతం ఈ వార్త తమిళ్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒకవేళ ఈ వాయిదా వార్త నిజం అయితే గేమ్ ఛేంజర్ కి మళ్ళీ ఇబ్బంది తప్పదు. ఈ విషయం చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గేమ్ ఛేంజర్ కూడా వాయిదా వేయాల్సి వస్తే.. ఈ ఏడాది రిలీజ్ చేయడం కష్టం. ఇతర సినిమాలు అన్ని డేట్స్ ఫిక్స్ చేసుకొని కూర్చొన్నాయి. మరి ఇన్నాళ్లు దర్శకుడు నిర్ణయానికి వదిలేసిన దిల్ రాజు.. ఈసారి ఎం చేస్తారో చూడాలి.

Also read : Kalki 2898 AD : నేను కల్కిలో నటించడం లేదు.. కానీ సినిమా మాత్రం.. రానా కామెంట్స్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • indian 2
  • Kamal Haasan
  • ram charan

Related News

Chikiri Peddi

Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

Peddi Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్‌ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం

  • Chikiri Peddi

    Peddi : పెద్ది ఫస్ట్ ప్రోమో..ఇది కదా రహమాన్ నుండి కోరుకుంటుంది !!

Latest News

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd