Kalki 2898 AD : ఇటలీ లో కల్కి సందడి
- Author : Sudheer
Date : 06-03-2024 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం ఇటలీలో ఉంది. ఇటలీలో ఆటా పాటా అంటూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్, దిశా పటానిల మీద సాంగ్ షూట్ చేస్తున్నట్టుగా.. ఈ ఫోటోల్లో ప్రభాస్, దిశా పటానీ చూస్తే అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని 2024 మే 9న విడుదల చేయబోతున్నారు. ఈ తరుణంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్ ను స్పీడ్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏప్రిల్ మొదటి వారంలో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే , దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా..లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, కల్కి, రాజా సాబ్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారు. డైలాగ్స్ వర్షెన్ బ్యాలెన్స్ ఉందన్నట్టుగా తెలుస్తోంది.
Italy lo aata paata 🕺🏻💃🏻 #Kalki2898AD pic.twitter.com/NTEio4vIu5
— Kalki 2898 AD (@Kalki2898AD) March 6, 2024
Read Also : Banana Kheer : అరటిపండుతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంతే..