Kajal Agarwal : బాలయ్య సినిమాలో కాజల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
Kajal Agarwal లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే.
- Author : Ramesh
Date : 06-05-2024 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
Kajal Agarwal లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. NBK 109వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుందని టాక్. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కూడా కాజల్ నటించింది. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో సినిమాలో కూడా కాజల్ భాగం అవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాకుండా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందట కాజల్.
NBK 109 సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కాజల్ కనిపిస్తుందత. కాజల్ పాత్ర కాస్త నెగిటివ్ టచ్ తో ఉంటుందని తెలుస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రయోగాలు చేయాలని చూస్తున్న కాజల్ బాలయ్యతో భగవంత్ కేసరిలో తన పాత్ర నిడివి తక్కువ ఉన్నా చేసింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ, బాబీ కాంబో సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.
ఈ సినిమాతో పాటుగా కాజల్ లీడ్ రోల్ లో సత్యభామ సినిమా వస్తుంది. ఈ సినిమా లో కాజల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.
Also Read : Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ అసలు పేరు అది కాదా.. ఇంతకీ ఆ సీక్రెట్ పేరేంటి..?