NTR – Sandeep Reddy : సెన్సేషనల్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ‘దేవర’ ఇంటర్వ్యూ..? ఫోటో వైరల్..
ఎన్టీఆర్ ముంబైలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని కలిశారు.
- Author : News Desk
Date : 09-09-2024 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
NTR – Sandeep Reddy : ఎన్టీఆర్ దేవర(Devara) సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న రాబోతుంది. ముంబైలో దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు.
అయితే ఎన్టీఆర్ ముంబైలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని కలిశారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి ఆ తర్వాత బాలీవుడ్ లో కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తీయబోతున్నాడు సందీప్. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సందీప్ రెడ్డిని కలవడం చర్చగా మారింది.
ఎన్టీఆర్ – సందీప్ రెడ్డి మాట్లాడుకుంటుండగా తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ – సందీప్ రెడ్డి వంగతో ఒక ఇంటర్వ్యూ చేశారట. బాలీవుడ్ లో సందీప్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటర్వ్యూ చేశారట. ఇది నిజమయితే ఫ్యాన్స్ కి పండగే. ఇక ఎన్టీఆర్ -సందీప్ ఫోటో చూసి వీరిద్దరికి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ – సందీప్ రెడ్డి వంగ అసలెందుకు కలిసారో..

Also Read : Sundeep Kishan : విజయ్ తనయుడి దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా..?