Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!
Jr NTR : తాజాగా ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Kantara Chapter 1 Pre Release Event)కి ఆయన నొప్పితోనే హాజరుకావడం ఈ డెడికేషన్‌కి మరోసారి ఉదాహరణ అయ్యింది. స్టేజ్ మీద మాట్లాడుతూ “ఎక్కువసేపు నిలబడలేను, కొంచెం నొప్పిగా ఉంది” అని అభిమానులను
- Author : Sudheer
Date : 29-09-2025 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా పేరుగాంచిన ఎన్టీఆర్ (NTR) ఎప్పటికప్పుడు తన డెడికేషన్ ద్వారా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల ఆయనకు గాయమై డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ, తాను నమ్మిన నిర్మాతలు, స్నేహితుల కోసం ఆయన విశ్రాంతిని వదిలి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Kantara Chapter 1 Pre Release Event)కి ఆయన నొప్పితోనే హాజరుకావడం ఈ డెడికేషన్‌కి మరోసారి ఉదాహరణ అయ్యింది. స్టేజ్ మీద మాట్లాడుతూ “ఎక్కువసేపు నిలబడలేను, కొంచెం నొప్పిగా ఉంది” అని అభిమానులను ఉద్దేశించి చెప్పడం, ఆయన పరిస్థితిని ప్రత్యక్షంగా తెలియజేసింది.
Team India: ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్న టీమిండియా!
హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూట్‌లో గాయపడిన ఎన్టీఆర్‌ను డాక్టర్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా కూడా నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ యాడ్ షూట్‌ను మరుసటి రోజే పూర్తి చేశారు. ఆ తర్వాత బయట కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన, రిషబ్ శెట్టి కోసం మాత్రమే ‘కాంతార చాప్టర్ 1’ ఈవెంట్‌కి నొప్పిని భరిస్తూ హాజరయ్యారు. ఈవెంట్‌లో ఆయన కుడి భుజం కింద తన చేతిని సపోర్ట్ తీసుకుంటూ కనిపించడం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం నెటిజన్లను కదిలించింది. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “దటీజ్ ఎన్టీఆర్” అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఆయన గాయం కారణంగా కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. ‘కాంతార’ ఈవెంట్‌లో నిర్మాత రవి మాట్లాడుతూ త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దీనితో షూటింగ్ ఆలస్యమవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. అయితే, ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే సెట్స్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆయన ఆరోగ్యంపై చూపిస్తున్న ఆందోళనతో పాటు, తన స్నేహితుని కోసం చూపించిన ఈ డెడికేషన్‌పై కూడా అభిమానులు గర్వం వ్యక్తం చేస్తున్నారు.