Jr NTR Looks: ఇంతలో ఎంత మార్పు.. ఎన్టీఆర్ లుక్స్ అదుర్స్!
కేవలం 10 రోజుల్లో ఎన్టీఆర్‌లో పెద్ద మార్పు కనిపించింది.
- By Balu J Published Date - 03:15 PM, Sat - 3 September 22
కేవలం 10 రోజుల్లో ఎన్టీఆర్‌లో పెద్ద మార్పు కనిపించింది. విపరీతమైన బరువు పెరిగిన ఎన్టీఆర్ కొద్దిరోజుల్లో తన బాడీషేప్ ను మార్చుకొని అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 10 రోజుల క్రితం, అమిత్ షాను కలిసిన ఎన్టీఆర్ బొద్దుగా కనిపించాడు. గడ్డం పెంచుకొని లుక్ చెదిరినట్టుగా కనిపించాడు. అయితే ఎన్టీఆర్ RRR కొమురంభీం కోసం తన లుక్ ను మార్చుకున్నాడు. ఆ సినిమా పూర్తయిన ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఆయన అభిమానులు లుక్స్ పై కామెంట్ చేశారు.
గత రాత్రి బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్లో ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఊహించని స్లిమ్ అయ్యాడు. ఆ లుక్ అరవింద్ సమేతలో మాదిరిగా ఉంది. కేవలం 10 రోజుల తర్వాత స్లిమ్‌గా కనిపించగలిగే ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. అతను ఏం చేశాడో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఆశ్చర్యపర్చాడు అని ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ 30 సినిమా త్వరలోనే ప్రారంభంకానుంది.
#NTR @tarak9999 👌🏻 pic.twitter.com/cmQpkOsu11
— vpr (@PrVpr) September 3, 2022
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (@AmitShah) August 21, 2022
Tags
Related News
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఆ గేమ్‌లో స్టేట్, నేషనల్ లెవల్స్ ఆడాడని తెలుసా?
ఎన్టీఆర్ ఓ గేమ్ లో నేషనల్, స్టేట్ లెవల్లో ఆడాడు అని చాలా తక్కువ మందికి తెలుసు.