Jani Master Remand : జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్
Jani Master Remand : జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్
- Author : Sudheer
Date : 20-09-2024 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
Jani Master Remand : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ (Jani Master) కు 14 రోజుల రిమాండ్ (14 Days Remand) ను విధిస్తు ఉప్పర్ పల్లి కోర్ట్ (Upper Pally Court ) తీర్పు ఇచ్చింది. నాల్గు రోజుల క్రితం మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిర్యాదు నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..జానీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా..అతడు గోవా లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు నిన్న అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి హైదరాబాద్ ఈరోజు తీసుకొచ్చారు.
ఉదయం ఓ రహస్య ప్రదేశంలో జానీని విచారించారు. అనంతరం ఉప్పర్ పల్లి కోర్ట్ లో హాజరు పరచగా..వాదనలు విన్న కోర్ట్ 14 రోజుల రిమాండ్ కు ఆదేశించింది. ప్రస్తుతం పోలీసులు జానీ ని చంచల్ గూడ జైలు కు తరలిస్తున్నారు. బెయిల్ కోసం రంగారెడ్డి కోర్ట్ కు అప్లై చేసుకున్నాడు జానీ..కాకపోతే నాన్ బెయిల్ కావడం తో అక్టోబర్ 03 వరకు జైల్లో ఉండాల్సిందే. తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని జానీ అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇటు చిత్రసీమలో పలువురు ఏదో కుట్రలో భాగంగానే పిర్యాదు చేసారని అంటున్నారు. చిత్రసీమలో జానీ టాప్ ప్లేస్ కు చేరుకోవడం, పొలిటికల్ గా కూడా పేరు తెచ్చుకుంటుండడం తో తట్టుకోలేక కావాలని జానీ ఫై పిర్యాదు చేయించారని అంటున్నారు.
Read Also : Keto Diet Effects : కీటో డైట్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి..!