Johnny master : జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Johnny master : బెంగళూరు ఎయిరోపోర్టు సమీపంలో ఈయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 11:21 AM, Thu - 19 September 24

Johnny master Arrest : లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లో జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది. చిత్రసీమలో ఇలాంటి జానీ మాస్టర్ లు ఎంతో మంది ఉన్నారు కానీ ధైర్యం చేసి బాధితులు ముందుకు రావడం లేదని..ఆలా వస్తే ఎంతో మంది మాస్టర్ల బండారం బయటపడుతుందని అంత మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటికే ఫిలిం ఛాంబర్ జానీ ఫై పలు ఆంక్షలు విధించింది. మరోపక్క ఇండస్ట్రీ లో దీని గురించి ఓపెన్ అవుతూ బయటకు వస్తున్నారు. ఇప్పటీకే పలువురు స్పందించడం జరిగింది. గత నాల్గు రోజులుగా పోలీసులకు దొకరకుండా తప్పించుకు తిరుగుతున్న జానీ ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బెంగళూరు ఎయిరోపోర్టు సమీపంలో ఈయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు అతడిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు (Nellore) నగరానికి చెందిన జానీ ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో (Dhee Dance Show) తో పాపులర్ అయ్యాడు. ఆ షో లో జానీ టాలెంట్ చూసిన అల్లు అర్జున్ తన సినిమాల్లో మొదటగా ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ..అతి తక్కువ టైంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ అగ్ర హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వస్తున్నాడు.
ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు
అలంటి జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. షూటింగ్ స్పాట్‌లోనూ వదిలేవాడు కాదని.. కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేది
తను చెప్పిన దానికి అంగీకరించకపోతే.. అద్దానికి తన తల బాదేవాడని.. తీవ్రంగా దాడి చేసేవాడని.. ఇండస్ట్రీ లో ఛాన్సులు లేకుండా చేస్తానని బెదిరించే వాడని ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్ ఎన్ని దారుణాలు చేసినా.. ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది. మతం మార్చుకొని.. తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని.. జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేదని.. వాపోయింది. ఇంటికి వచ్చి మరీ ఆమె తనపై దాడి చేసిందని తెలిపింది. ఈమె పిర్యాదు తో జానీ మాస్టర్ పై పోలీసుల ఐపీసీ చట్టం కింద సెక్షన్ 376, నేరపూరితంగా బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, కింద కేసు నమోదు చేశారు.
కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి జానీ సస్పెండ్
ఇక ఈ పిర్యాదు నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సైతం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేసారు.
Read Also : Star Player Comeback: రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్..!