Jersey Rerelease : నాని తో కలిసి జెర్సీ సినిమా చూస్తారా..?
Jersee Rerelease న్యాచురల్ స్టార్ నాని గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న
- Author : Ramesh
Date : 19-04-2024 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
Jersee Rerelease న్యాచురల్ స్టార్ నాని గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ సందర్భంగా నానితో పాటు దర్శక నిర్మాతలు గౌతం తిన్ననూరి, నాగ వంశీ కలిసి సినిమా చూసేందుకు సిద్ధమయ్యారు. అదికూడా ఆడియన్స్ అందరితో కలిసి జెర్సీ సినిమా చూడబోతున్నారు.
సుదర్శన్ 35 ఎం.ఎం లో జెర్సీ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈవెనింగ్ ఆరు గంటల షోకి నాని, గౌతం తిన్ననూరి, నాగ వంశీ రాబోతున్నారు. ఆడియన్స్ తో పాటు వారు కూడా సినిమాను చూడబోతున్నారు. ఈ విషయం తెలిసి నాని ఫ్యాన్స్ అంతా సుదర్శన్ కి వచ్చి తమ అభిమాన హీరోతో కలిసి ఆ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు.

నాని జెర్సీ సినిమా ప్రేక్షకుల ఆమోదంతో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను గౌతం తిన్ననూరి హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. జెర్సీ సినిమా తర్వాత మళ్లీ గౌతం తో నాని పనిచేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు.
Also Read : Kavya Kalyan Ram : బలగం బ్యూటీ ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదుగా..!