Tollywood : తెలుగు హీరోలను చూస్తే సిగ్గేస్తుంది -జేసీ సంచలన వ్యాఖ్యలు
టికెట్ ధరలు పెంచండి అంటూ ప్రత్యేక విమానాల్లో అంత వచ్చి జగన్ కాళ్ల దగ్గర పడ్డారు..ఈరోజు రాష్ట్రం ఇంత దారుణంగా మారితే మాట్లాడారా
- Author : Sudheer
Date : 15-09-2023 - 1:36 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు హీరోలను (Tollywood Heros) చూస్తే సిగ్గేస్తుందని అన్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy). అక్రమ కేసులో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే స్పందించారా..అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ (AP) ఎంత దారుణంగా ఉందొ చూస్తున్నారు..రాష్ట్రంలో బ్రతికే రోజులు పోయాయి..జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఇలా రాష్ట్రాన్ని మరచిపోవాల్సిందే..రోడ్లు లేవు..పరిశ్రమలు లేవు..ఉద్యోగాలు లేవు..చేద్దామంటే పని లేదు..ఇంత దారుణంగా ఉంటె కనీసం రాష్ట్రాన్ని బాగుచేయాలని మీకు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
రాష్ట్రమే కాదు చిత్రసీమ విషయంలో కూడా జగన్ (CM Jagan) ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు తెలియదా..పది రూపాయలకు టీ కూడా రాని ఈరోజుల్లో సినిమా టికెట్ ధర ను పది రూపాయిలు చేసి నిర్మాతలను , డిస్ట్రబ్యూటర్స్ ను ఆర్ధికంగా నష్టపరిచిన విషయం మీకు తెలియదా..ఆనాడు టికెట్ ధరలు (AP Movie Ticket Price) పెంచండి అంటూ ప్రత్యేక విమానాల్లో అంత వచ్చి జగన్ కాళ్ల దగ్గర పడ్డారు..ఈరోజు రాష్ట్రం ఇంత దారుణంగా మారితే మాట్లాడారా..మీరేం హీరోలు..అంటూ ఫైర్ అయ్యారు జేసీ. నిజమైన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని …సినిమాలు చేస్తే వేల కోట్లు వస్తాయి..అయినప్పటికీ అవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రం బాగుండాలని..అందరు సంతోషంగా ఉందని ఈరోజు రాష్ట్రం కోసం నేనున్నానంటూ వచ్చి నిలబడ్డాడు చూడు..అది హీరో అంటే..రియల్ హీరో అంటే ఆయన అంటూ పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపించారు. మీరంతా అలాగే సైలెంట్ గా ఉంటె..ఇక మీరెప్పటికీ అలాగే ఉంటారు..మీరు ఏపీకి రాలేరు..ఏపీ రోడ్ల ఫై తిరగలేరని హెచ్చరించారు. ప్రస్తుతం జేసీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.
Read Also : Hyderabad: చంద్రబాబు మద్దతుదారులకు హైదరాబాద్ డీసీపీ వార్నింగ్