Jawan: అడ్వాన్స్ బుకింగ్స్ లో జవాన్ రికార్డ్, 2 లక్షల 35 వేల టిక్కెట్లు అమ్మకం
ఆరు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన జవాన్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.
- By Balu J Published Date - 01:34 PM, Sat - 2 September 23
విడుదలకు ఆరు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన జవాన్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. నిర్మాణ సంస్థ చాలా తెలివిగా ముందుగానే థియేటర్లను బుక్ చేసి పక్కా ప్లానింగ్ తో సేల్స్ చేయడంతో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇండియా వైడ్ గా 2 లక్షల 35 వేల టిక్కెట్లు అమ్మిన జవాన్.. ఇప్పటికే 8 కోట్ల రూపాయలకు చేరింది. దీన్ని బట్టి షారుక్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన జవాన్ ట్రైలర్ రాగానే అంచనాలు మారిపోయాయి.
రెగ్యులర్ యాక్షన్ డ్రామా అనుకుంటే మర్చిపోయేలా విజువల్స్‌తో షాకింగ్‌గా అనేక గెటప్‌లలో బాద్షా కనిపించడం ఒక్కసారిగా హైప్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా బాలీవుడ్లో ఎక్కువ శాతం రొమాంటిక్‌లు వస్తున్నాయి. గదర్ 2 మాత్రమే జనాల కరువును తీర్చింది. ఇప్పుడు జవాన్ వంతు వచ్చింది.
తెలుగు తమిళ వెర్షన్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు బుకింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. తన మూడు దశాబ్దాల కెరీర్లో తొలిసారిగా షారుక్ ఖాన్ జవాన్ కోసం ఖాకీ చొక్కా ధరించాడు. ఇంతకుముందు వన్ టూ కా ఫోర్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించినా.. యూనిఫాంలో లేడు. కానీ జవాన్ చెప్పా రు. ఇదే కాదు గుండుతో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు ప్రేక్షకులు మొదటిరోజే చూడాలనుకుంటున్నారు. మల్టీప్లెక్స్ స్ర్కీన్ల టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
Also Read: OG Glimpse: పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్.. ఓజీ గ్లింప్స్ వచ్చేసింది!
Related News
Teja Sajja : తేజా సజ్జా పర్ఫెక్ట్ లైనప్..!
Teja Sajja యువ హీరోల్లో తేజా చూపిస్తున్న దూకుడు చూసి మిగతా హీరోలంతా అవాక్కవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా సమంత నటించిన ఓ బేబీ సినిమాతో టీనేజ్ రోల్ చేశాడు.