Allu Arjun Arrest : పుష్ప కు జైలా..? బెయిలా..? కోర్ట్ కు తరలివస్తున్న నిర్మాతలు
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి , నాగబాబు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు అడిగితెలుసుకోగా..ఇటు దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు దిల్ రాజు , నాగవంశీ లు పోలీస్ స్టేషన్ కు వచ్చారు
- By Sudheer Published Date - 04:02 PM, Fri - 13 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై యావత్ సినీ లోకం భగ్గుమంటుంది. చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి..అనంతరం గాంధీ హాస్పటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసారు.అనంతరం నాంపల్లి కోర్ట్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం జడ్జ్ ముందు బన్నీ ని హాజరు పరిచారు.
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి , నాగబాబు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు అడిగితెలుసుకోగా..ఇటు దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు దిల్ రాజు , నాగవంశీ లు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడి నుండి కోర్ట్ కు వచ్చి అల్లు అర్జున్ కు మద్దతు తెలిపారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు. భద్రత లోపానికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇక రాజకీయ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ కు బెయిలా ..లేక రిమాండ్ అనేది తెలుస్తుంది. ఒకవేళ రిమాండ్ విదిస్తే ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Read Also : Allu Arjun Arrest : కీలక లెటర్ ను బయటపెట్టిన సంధ్య థియేటర్