Jacqueline Fernande : అమ్మడికి హిట్స్ లేవు కానీ ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి..
మర్డర్, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ బ్యూటీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది
- By Sudheer Published Date - 04:36 PM, Thu - 29 August 24

చిత్రసీమ(Film Industry )లో హిట్స్ పడితేనే ఆదాయం..హిట్స్ లేకపోతే అంతే సంగతి. కానీ ఇక్కడ ఓ హీరోయిన్ కు మాత్రం గత 8 ఏళ్లుగా హిట్ అనేది లేదు..కానీ ఆస్తులు మాత్రం గట్టిగానే వెనకేసుకుంటుంది. అమ్మడి ఆస్తుల లెక్క తెలిసి అంత నోర్లు వెల్లబెడుతున్నారు. ఇంత డబ్బు , ఆస్తులు ఎలా వస్తున్నాయబ్బా అని మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనే కదా మీ సందేహం. జాక్వాలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernande). అలాడిన్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మర్డర్, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ బ్యూటీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. చివరిగా హౌస్ ఫుల్ 3 సినిమాతో సక్సెస్ అందుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతమైతే వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ …హిట్స్ అనేవి మాత్రం లేవు. అయినప్పటికీ వరుస ఛాన్సులు తలుపుతడుతున్నాయి. అమ్మడికి హిట్స్ లేనప్పటికీ ఓ ఖరీదైన ప్రైవేట్ ఐల్యాండ్ ఉంది. 2012 లో ఈమె శ్రీలంకలో లో ప్రైవేట్ ఐలాండ్ ను కొనుగోలు చేసింది. అప్పట్లో దాని విలువ చాలా తక్కువట. కేవలం రూ.3 కోట్లకే ప్రైవేట్ ఐలాండ్‌ను తన సొంతం చేసుకున్న జాక్వెలిన్ వరుసగా సినిమాలన్నీ హిట్ కొడుతున్న సమయంలో ఆమె దాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ ఐలాండ్ కు వందల కోట్లు పలుకుంటుందట. ఈ ప్రైవేట్ ఐలాండ్‌లో ఆధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన ఒక మంచి భవనాన్ని నిర్మించాలని ఆలోచనలో జాక్వాలిన్ ఉందట. కేవలం ఈ ల్యాండ్ మాత్రమే కాదు సొంతంగా ఇల్లు, ఖరీదైన కార్లు కూడా అమ్మడి దగ్గర ఉన్నాయట. ఇకపోతే ఈమె సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గట్టిగానే సంపాదిస్తుంది.
Read Also : Mamata Banerjee : ప్రధాని మోడీకి వార్నింగ్ వ్యాఖ్యలు.. సీఎం దీదీపై పోలీసులకు ఫిర్యాదు