Upasana : ఇంత ఘోరాన్ని చూస్తూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకోగలం ? : ఉపాసన
దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రముఖ హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్(ఎక్స్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు.
- By Pasha Published Date - 12:43 PM, Thu - 15 August 24

Upasana : దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రముఖ హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్(ఎక్స్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఉపాసన కొణిదెల తన ఎక్స్ పోస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేం స్వాతంత్య్ర దినోత్సవం’’ అని పేర్కొన్న ఉపాసన.. సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతోందని ఆమె చెప్పారు. ‘‘ఆ జూనియర్ డాక్టర్ జీవితానికి విలువే లేదా?’’ అని ఉపాసన(Upasana) ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మన సమాజంలో ఇంకా ఇలాంటి అరాచకాలను ఎన్నాళ్లు చూడాలి. ఇవన్నీ చూస్తూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకోగలం. ఇంత కన్నా అమానుషం ఇంకేం ఉంటుంది’’ అని ఆమె అసహనం వెళ్లగక్కారు. ‘‘దేశంలో హెల్త్ కేర్ రంగానికి మహిళలే వెన్నెముక. ఈ రంగంలో 50 శాతం వాటా వాళ్లదే. మహిళలు పేషెంట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ల సేవలు దేశానికి అత్యవసరం. ఆ స్ఫూర్తితోనే నేనూ ఈ రంగంలోనే ఉన్నాను. ప్రతి మహిళకు భద్రతాపరమైన భరోసా కల్పించాలి. కలిసికట్టుగా ఈ మార్పుని సాధించగలం’’ అని ఉపాసన అభిప్రాయపడ్డారు.
Also Read :Rega Kantarao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. ఎందుకంటే ?
మా కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగింది : జూనియర్ వైద్యురాలి పేరెంట్స్
తమ కూతురిపై జరిగింది గ్యాంగ్ రేపే అని చనిపోయిన జూనియర్ వైద్యురాలి(31) తల్లిదండ్రులు మంగళవారం రోజు కోల్‌కతా హైకోర్టుకు తెలిపారు. ‘‘మా కుమార్తె డెడ్‌బాడీలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని పోస్టుమార్టంలో తేలింది. ఒకరికి మించిన వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఇదే పెద్ద ఆధారం’’ అని వారు న్యాయస్థానానికి తెలిపారు. ‘‘గొంతు నులిమి మా కూతురిని చంపారని పోస్టుమార్టం నివేదికలో తేల్చారు’’ అని జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు కోర్టుకు వివరించారు. ‘‘అత్యాచారానికి తెగబడిన వారి నుంచి తప్పించుకునేందుకు మా కూతురు తీవ్రంగా ప్రతిఘటించింది. ఈక్రమంలో ఆమె పెదవులకూ గాయాలయ్యాయి. అత్యాచారం చేసే క్రమంలో బలప్రయోగంతో ఆమె నోటిని మూసి ఉంటారు’’ అని మృతురాలి పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగింది కాబట్టే అన్ని రంగాల ప్రముఖులు కోల్‌కతా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :Google Doodle : డూడుల్‌తో ‘ఇండిపెండెన్స్ డే’ విషెస్ చెప్పిన గూగుల్
#jaihind pic.twitter.com/qZIp9ALwNe
— Upasana Konidela (@upasanakonidela) August 15, 2024