Box Office : ‘మురారి’ ని టచ్ చేయలేకపోయిన ‘ఇంద్ర’
ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని మెగా అభిమానులు భావించారు కానీ అలాంటిదేమి జరగలేదు.
- By Sudheer Published Date - 10:27 AM, Sat - 24 August 24

ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే. ఈ సందర్బంగా ఇంద్ర (Indra) మూవీని రీ రిలీజ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
2002లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమ నటనతో మెప్పించారు. అలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇప్పుడు మరోసారి 4కే వెర్షన్ లో రీరిలీజ్ అవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రీ రిలీజ్ అయినా ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. అయితే ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని మెగా అభిమానులు భావించారు కానీ అలాంటిదేమి జరగలేదు. ముఖ్యంగా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ అయినా మురారి (Murari) కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని భావించారు కానీ కనీసం ఆ కలెక్షన్లను దరిదాపుల్లోకూడా రాకుండా పోయింది.
మురారి మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 5.4 కోట్ల గ్రాస్ రాబట్టగా.. మొత్తంగా 9 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రికార్డు ను ఇంద్ర బ్రేక్ చేస్తుందని భావించారు.. కానీ ఈ సినిమా మురారి డే వన్ వసూళ్లను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఇంద్ర రీ రిలీజ్ వసూళ్లు 3.05 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ మెగాస్టార్ రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర దుమ్ము దులుపుతుంది. అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఇంద్ర చిత్రాన్ని థియేటర్స్ లలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటి తాలూకా వీడియోస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటె చిరంజీవి ‘ఇంద్ర’ టీమ్ ను ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్, దర్శకుడు బి. గోపాల్, మరుపురాని డైలాగ్స్ అందించిన పరుచూరి బ్రదర్స్, కధనందించిన చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మకు సత్కారం చేశారు. అలాగే చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.
Read Also : Shikhar Dhawan: వాట్ నెక్స్ట్.. శిఖర్ ధావన్ ఐపీఎల్ ఆడతాడా..?