Ilayaraja’s Daughter Bhavatharini : ఇళయరాజా ఇంట విషాద ఛాయలు ..
- By Sudheer Published Date - 09:43 PM, Thu - 25 January 24

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja ) ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇళయరాజా కుమార్తె (Ilayaraja Daughter died), గాయని భవతారిణి (Bhavatharini)(47) క్యాన్సర్ (Liver cancer)తో కన్నుమూశారు. కొద్దీ రోజులుగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె. చికిత్స నిమిత్తం శ్రీలంక ( Sri Lanka) కు వెళ్లగా..అక్కడ ఆమె పరిస్థితి విషమించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు మరణించారు. భవతరిణి మరణవార్త తెలిసి, సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. భవతరిణి.. ఇళయరాజా కుమార్తెగానే కాకుండా, పలు తమిళ సినిమాల్లో పాటలు పాడటం ద్వారా మంచి గుర్తింపు పొందారు.
We’re now on WhatsApp. Click to Join.
చిన్న వయసులోనే ఆమె కన్నుమూయడంతో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని రోసరీ మెట్రిక్యులేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన భవతారిణి… తండ్రి బాటలోనే సంగీతాన్నే కెరీర్ గా ఎంచుకున్నారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు అందుకున్నారు. తండ్రి ఇళయరాజా, సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ ఇళయారాజాల సంగీత దర్శకత్వంలో భవతారిణి చాలా పాటలు పాడారు. ఇళయారాజా సంగీత దర్శకత్వంలో నేపథ్య గాయనిగా ‘భార్తీ’ చిత్రంలో ‘మైల్ పోలా పొణ్ణు ఒణ్ణు’ అనే పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె చివరిగా మలయాళ చిత్రం ‘మాయానది’లో పాడారు. భవతారిణి భౌతికకాయాన్ని రేపు చెన్నైకి తీసుకురానున్నారు.. అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also : Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..