HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Huge Remuneration After A Hit Trisha Shocks Producers

Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

  • Author : Vamsi Chowdary Korata Date : 15-06-2026 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Huge remuneration after a hit... Trisha shocks producers.
Huge remuneration after a hit... Trisha shocks producers.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, అభిమానులతో ముద్దుగా ‘చెన్నై చంద్రం’గా పిలిపించుకునే నటి త్రిష కృష్ణన్… వయసుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనతో నేటికీ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఆమె ఎంచుకుంటున్న కథలు, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో త్రిష క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని ఆకాశాన్నంతగా పెంచేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘కరుప్పు’ హిట్‌తో మారిన రేంజ్

ఇటీవల కాలం వరకు ఒక్కో సినిమాకు రూ.5-6 కోట్ల వరకు తీసుకున్న త్రిష, ఇప్పుడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.12-15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (Karuppu) బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, ఈ భారీ మొత్తాన్ని కోరినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కోసం కేవలం రూ.6 కోట్లకు లోపే తీసుకున్న త్రిష, ఇప్పుడు ఒక్కసారిగా రేటు రెట్టింపు చేయడంతో నిర్మాతలు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు.

సినిమాల సంగతి పక్కన పెడితే, తమిళ స్టార్ హీరో, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ జోసెఫ్‌తో త్రిష రిలేషన్‌షిప్ గురించి కొంతకాలంగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ‘గిల్లి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ ‘లియో’ చిత్రంలో కలిసి నటించారు. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి త్రిషతో ఉన్న బంధమే కారణమంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో త్రిష ప్రత్యేకంగా హాజరుకావడం, ఆమె ధరించిన ఒక ల్యాకెట్ వీడియో వైరల్ అవ్వడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగినా అది నిజం కాదని తెలుస్తోంది. మరోవైపు విజయ్-సంగీతలను మళ్లీ కలిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, త్రిష విజయ్ జీవితం నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రిష సినిమాలపై మరింత ఫోకస్ పెట్టి తన క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు రెమ్యునరేషన్ డబుల్ చేసిందని అంటున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Karuppu
  • Kollywood
  • Remuneration
  • Trisha Krishnan

Related News

    Latest News

    • RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

    • Anger Management: మీకు కోపం ఎక్కువ? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!

    • Bapatla: సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

    • Alcohol: మద్యం సేవించినప్పుడు ఎక్కువగా చెమట ఎందుకు పడుతుందో తెలుసా…?

    • Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd