War 2 Teaser : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సీన్స్ అదరగొట్టారుగా..
వార్ 2 టీజర్ చూసేయండి..
- By News Desk Published Date - 11:15 AM, Tue - 20 May 25

War 2 Teaser : RRR తో నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో చేస్తున్నాడు. బాలీవుడ్ స్పై యూనివర్స్ సినిమాల్లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ కూడా హృతిక్ రోషన్ తో కలిసి మెయిన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అయితే నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఎన్టీఆర్ వాయిస్ తో.. నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్ అంటూ మొదలయింది. ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ అన్నట్టు వార్ సాగింది. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ట్రైన్ మీద, ఫ్లైట్ నుంచి దూకడాలు.. ఇలాంటి భారీ యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిపి చేసినట్టు తెలుస్తుంది.
దీంతో వార్ 2 టీజర్ వైరల్ గా మారింది. అయితే టీజర్ చూస్తుంటే ఎన్టీఆర్ విలన్ రోల్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని ఆగస్టు 14 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. వార్ 2 టీజర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి మరింత స్టార్ డమ్ రావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మీరు కూడా వార్ 2 టీజర్ చూసేయండి..
Also Read : Bellamkonda Sreenivas : ప్రభాస్ సినిమా రీమేక్ చేయకుండా ఉండాల్సింది.. ఫ్లాప్ అయ్యాక హీరో కామెంట్స్..