Bellamkonda Sreenivas : ప్రభాస్ సినిమా రీమేక్ చేయకుండా ఉండాల్సింది.. ఫ్లాప్ అయ్యాక హీరో కామెంట్స్..
ఛత్రపతి రీమేక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్.
- By News Desk Published Date - 10:20 AM, Tue - 20 May 25

Bellamkonda Sreenivas : మాస్ సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని సినిమాలు హిట్ అయినా ఎక్కువ సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే ఇతని యాక్షన్ సినిమాలకు హిందీలో మంచి పేరు, మంచి వ్యూస్ వచ్చాయి. హిందీలో శ్రీనివాస్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఇదంతా యూట్యూబ్ లో. ఈ డిమాండ్ చూసి తాను హిందీలో సినిమాలో తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారనుకున్నాడో ఏమో ప్రభాస్ ఛత్రపతి సినిమా రీమేక్ చేసాడు.
కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. పెట్టిన బడ్జెట్ లో సగానికి సగం కూడా కలెక్షన్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు భైరవం సినిమాతో మే 30న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఛత్రపతి రీమేక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. నాన్నకు చెప్తే చేయమన్నారు. 2019 లోనే ఛత్రపతి రీమేక్ కోసం సంతకం చేశాను. నేను చేస్తుంది సౌత్ సినిమా రీమేక్, యాక్షన్ సినిమా, సవతి తల్లి – బిడ్డ సెంటిమెంట్ సినిమాలు హిందీలో రాలేదు, ఆ ఎమోషన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని ఒప్పించారు నిర్మాతలు. వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ రీమేక్ సినిమా చేయకుండా ఉండాల్సింది. అప్పటికే సౌత్ సినిమాలు చూస్తున్నారు హిందీ వాళ్ళు. ఛత్రపతి రీమేక్ సమయంలోనే ఇది వర్కౌట్ అవుతుందా అనే సందేహంతో ఉన్నాను. అందుకే సినిమాపై 100 శాతం దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపాడు.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ హిట్ సినిమా ఛత్రపతి రీమేక్ చేసి ఫ్లాప్ అయ్యాక ఇప్పుడు ఇలా మాట్లాడటంతో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.