Raasi : వెంకటేష్ పై మనసుపడ్డ హీరోయిన్ రాశి..
Raasi : వెంకటేష్ పై మనసు పడిదంట. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని భీష్మించి కూర్చుందట
- By Sudheer Published Date - 03:39 PM, Sun - 3 November 24

గోకులంలో సీత (Gokulamlo Seetha) ఫేమ్ రాశి (Rashi ) సీనియర్ హీరో వెంకటేష్ పై మనసు పడిదంట. పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని భీష్మించి కూర్చుందట..తల్లిదండ్రులు వెంకటేష్ కు పెళ్లి అయ్యిందని చెప్పిన కానీ వినలేదట..ఈయన్నే కాదు రాజీవ్ గాంధీ ని కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపిందట..ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపింది. గోకులంలో సీత తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి..ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పింది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఐటెం సాంగ్ , విలన్ వేషాల్లో కూడా రాశి నటించింది. ప్రస్తుతం బుల్లితెర తో పాటు వెండితెర ఛాన్సులు వస్తే ఓకే చేస్తుంది. ఓ టాక్ షో లో ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చిన్నతనంలో నటుడు దగ్గుబాటి వెంకటేష్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని, ఆ ఇష్టం తో ఆయన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
తన తల్లిదండ్రులు చెప్పినా వినలేదని ..వెంకటేష్ కు పెళ్లి అయ్యిందని నచ్చజెప్పడం తో వెంకటేష్ ను మరచిపోయానని, ఆ తర్వాత పేపర్ లో రాజీవ్ గాంధీ(Ragiv Gandhi) ఫోటో చూసి నా మనసు ఆయన వైపు మళ్లింది. ఆయన ఓ పెద్ద పొలిటిషన్ అనే సంగతి నాకు తెలియదు. కానీ ఓ పేపర్లో ఆయన ఫొటో చూసి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు..పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ గొడవ చేశాను. ఈ విషయంలో నా తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అయ్యారు. అలా నేను చిన్నతనంలో ఎంతో వెరైటీగా మాట్లాడేదాన్ని. అలాగే నేను సినిమాలో హీరోయిన్‌గా చేసే సమయంలో కూడా నేను చేసే డైరెక్టర్లతో, నిర్మాతలతో నేను పెళ్లి చేసుకుంటాను ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అని చెప్పే దాన్ని. నా మాటలకు వాళ్ళు కూడా షాక్ అయిపోయేవారు” అంటూ షో లో రాశి చెప్పుకొచ్చింది.
Read Also : Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్