Ivana : లవ్‌టుడే హీరోయిన్ తెలుగు లో ఎంట్రీ.. సుకుమార్ చేతుల మీదుగా..
లవ్‌టుడే సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఇవానాకు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మూడు తమిళ సినిమాల్లో ఇవానా హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
- By News Desk Published Date - 06:00 PM, Sat - 22 April 23

తమిళ్(Tamil) లో చిన్న సినిమాగా రిలీజయిన లవ్‌టుడే(Love Today) భారీ విజయం సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఇవానాకు(Ivana) మంచి పేరు రావడంతో పాటు తెలుగు, తమిళ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
లవ్‌టుడే సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఇవానాకు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మూడు తమిళ సినిమాల్లో ఇవానా హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఇవానా. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ గతంలో రౌడీ హీరో సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పర్వాలేదనిపించింది.
ఆశిష్ ఇప్పుడు సెల్ఫిష్ అనే మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను సుకుమార్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా నేడు సెల్ఫిష్ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. దీంతో ఇవానా తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మొదటి సినిమానే దిల్ రాజు, సుకుమార్ లాంటి స్టార్స్ చేతుల మీదగా లాంచ్ అవుతుండటం ఇవానా అదృష్టం అని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఇవానా తెలుగులో హీరోయిన్ గా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read : Pooja Hegde Upset: పూజా హెగ్డేను వెంటాడుతున్న ఫ్లాపులు.. బుట్టబొమ్మ ఖాతాలో ఐదో డిజాస్టర్!