Surya : పునీత్ సమాధి వద్ద హీరో సూర్య కంటతడి.. ఐ మిస్ యూ అంటూ!
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిన విషయం విధితమే. ఆయన అంత్యక్రియలు జరిగి నాలుగైదు రోజులు కావోస్తున్నా అభిమానులు, పలువురు సినీ హీరోలు పునీత్ మెమోరీస్ ను గుర్తుచేసుకుంటున్నారు.
- Author : Balu J
Date : 05-11-2021 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిన విషయం విధితమే. ఆయన అంత్యక్రియలు జరిగి నాలుగైదు రోజులు కావోస్తున్నా అభిమానులు, పలువురు సినీ హీరోలు పునీత్ మెమోరీస్ ను గుర్తుచేసుకుంటున్నారు. ఇక పునీత్ అభిమానులయితే ఇప్పటికీ ఆయన సమాధిని సందర్శిస్తూ నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు బాలయ్య, చిరు, ఎన్టీఆర్, శ్రీకాంత్, వెంకటేశ్ లాంటివాళ్లు అంత్యక్రియలు హాజరై, పునీత్ కుటంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక తమిళ్ నటుడు విశాల్ పునీత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తాను కొనసాగిస్తున్నాని ఇప్పటికే స్పష్టం చేశారు.
తాజాగా మరో హీరో, జైభీమ్ ఫేం సూర్య ఇవాళ కంఠీరవ స్టూడియోస్ లోని పునీత్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కంటతడి పెట్టారు. అంత్యక్రియలకు రాలేకపోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఏ ఫొటో చూసినా.. ఏ వీడియో చూసినా పునీత్ స్మైల్ ఆకట్టుకునేదని, పునీత్ చనిపోయాడన్న విషయం ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. పునీత్ ను నేను కచ్చితంగా మిస్ అవుతున్నా’’ అంటూ ఎమోషన్ అయ్యారు. హీరో సూర్య వెంట పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా సూర్య వెంట ఉన్నారు. పునీత్ దూరమైన రోజులు గడుస్తున్నా కన్నడ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. పునీత్ మరణం తీరని లోటు అని, కన్నడ చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ అని అంటున్నారు పునీత్ ఫ్యాన్స్.
Actor @Suriya_offl pays respect to Puneeth Rajkumar at his memorial earlier today #PuneethRajkumar pic.twitter.com/MCUmxymi0z
— Vishnu (@johnvishnu) November 5, 2021