HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # Revanth Reddy
  • # PM Modi
  • # Cyclone
  • # BJP
  • # Congress

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Hero Sudhakar Komakula Interview Special

Interview : కానిస్టేబుల్, ఏసీపీ..రెండు డిఫరెంట్ రోల్స్ : హీరో సుధాకర్ కోమాకుల

సుధాకర్ కోమాకుల... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా 'క్రాక్'తోనూ పేరు తెచ్చుకున్నారు. 'రాజా విక్రమార్క' సినిమాతో ఈ శుక్రవారం ఏసీపీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  • By Balu J Published Date - 04:24 PM, Wed - 10 November 21
  • daily-hunt
Interview : కానిస్టేబుల్, ఏసీపీ..రెండు డిఫరెంట్ రోల్స్ : హీరో సుధాకర్ కోమాకుల

సుధాకర్ కోమాకుల… ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా ‘క్రాక్’తోనూ పేరు తెచ్చుకున్నారు. ‘రాజా విక్రమార్క’ సినిమాతో ఈ శుక్రవారం ఏసీపీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఇందులో హీరో ఎన్ఐఏ ఏజెంట్ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్ కోమాకుల ఏసీపీ రోల్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకులతో ఇంటర్వ్యూ…
*ప్రశ్న: మీ పుట్టినరోజున సినిమా విడుదలవుతోంది. మీకు స్పెషల్ మూమెంట్ కదా!*
నవంబర్ 12న నా పుట్టినరోజు. అదే రోజు ఈ సినిమా విడుదల. అలా కుదిరింది. నిజంగా నాకు స్పెషల్ మూమెంట్.
*ప్రశ్న: ‘రాజా విక్రమార్క’… ఈ సినిమాలోకి మీరెలా వచ్చారు?*
దర్శకుడు శ్రీ సరిపల్లి సుమారు పదేళ్లు నుంచి తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకు పని చేశాడు. అక్కడ నన్ను రెండు మూడు సినిమాలకు ఆడిషన్ చేశాడు. కెరీర్ పరంగా చూసినా… నేను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చేసినప్పుడు అతను సహాయ దర్శకుడిగా వేరే సినిమాలకు పని చేసేవాడు. నా ‘నువ్వు తోపురా’ సినిమాకు చీఫ్ అసోసియేట్ గా పని చేశాడు. అలా మా మధ్య పరిచయం మరింత బలపడింది. ఈ సినిమా అనుకుంటున్న సంగతి నాకు తెలుసు. కార్తికేయతో ఓకే అయ్యిందని చెప్పాడు. ఒకరోజు ఫోన్ చేసి ‘నువ్వు ఓ రోల్ చేయాలి’ అన్నాడు. ‘నేను చేయను. హీరోగా సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పా. ‘చాలా మంచి రోల్. నీకు బావుంటుంది’ అని అన్నాడు. నాకు ఆల్రెడీ రోల్ గురించి తెలుసు. ‘నువ్వు తోపురా’ సినిమా తర్వాత నాకు కొంచెం బ్రేక్ వచ్చింది. హీరోగా సినిమాలు చేస్తూ మధ్యలో ‘క్రాక్’, ఈ ‘రాజా విక్రమార్క’ చేశా.
*ప్రశ్న: ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?*
సినిమా పరంగా చెప్పాలంటే… కీలకమైన పాత్ర. గోవింద్ అని ఏసీపీ రోల్ చేశా. అతను హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్యూటిరీ ఆఫీసర్. ఇప్పటివరకూ సరదా పాత్రలు చేశా. ఇందులో నా పాత్ర గంభీరంగా ఉంటుంది. హీరో సహా మిగతా నటీనటులు అందరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. లుక్ బావుందని అందరూ ప్రశంసిస్తున్నారు.
*ప్రశ్న: హీరోగా చేస్తూ… వేరే సినిమాల్లో రోల్ చేయడానికి ఆలోచించారా?*
ఎప్పుడూ హీరోగా చేయాలని అనుకోలేదు. మంచి పాత్రలు వస్తే చేద్దామని అనుకున్నాను. కానీ, నాకు రాలేదు. ఇందులో కుదిరింది. ప్రస్తుతం కార్తికేయ యంగెస్ట్ సెన్సేషన్. తనతో చేయడం నాకు హెల్ప్ అవుతుంది. ఎట్ సేమ్ టైమ్… కాంబినేషన్ సీన్స్ చూడటం ఆడియన్స్ కు బావుంటుంది. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ కూడా అలా చూడటం లేదు. కార్తికేయ కూడా తమిళ్ ‘వలిమై’లో విలన్ రోల్ చేశాడు. హీరోగా నా ఆకలి తీరలేదు. ఎక్కువ హీరో రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. మధ్యలో మంచి రోల్స్ వస్తే చేస్తాను.
*ప్రశ్న: ఈ రోల్ కోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా?*
నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నాం. కానీ, కరోనా వల్ల రెండేళ్లు పట్టింది. ఇన్ని రోజులు బాడీ మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను.
*ప్రశ్న: ‘క్రాక్’లో కానిస్టేబుల్, ‘రాజా విక్రమార్క’లో ఏసీపీ… కొన్ని రోజులు పోలీస్ అంటే సుధాకర్ కోమాకుల గుర్తుకు వస్తారేమో?*
(నవ్వుతూ…) ‘క్రాక్’ ముందు రిలీజ్ అయ్యింది. కానీ, ‘రాజా విక్రమార్క’ ముందు అంగీకరించాను. కానిస్టేబుల్, ఏసీపీ… రెండు డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ సినిమాల్లో పోలీస్ పాత్రలు కాదు. వేరే రోల్స్ అవి.
*ప్రశ్న: దర్శకుడిగా శ్రీ సరిపల్లికి, అంతకు ముందు చీఫ్ అసోసియేట్ శ్రీ సరిపల్లికి తేడా ఏంటి?*
అప్పుడు చాలా అగ్రెస్సివ్ గా ఉండేవాడు. ఇప్పుడు కామ్ అయ్యాడు. చాలా కూల్ గా అందరితో పని చేయించుకున్నాడు. అతను పని రాక్షసుడు. ఆ ఒక్క లక్షణం మారలేదు.
*ప్రశ్న: శ్రీ సరిపల్లి మీ స్నేహితుడు కాబట్టి… మీ కోసం ప్రత్యేకంగా సన్నివేశాలు రాయడం… మీ రోల్ ఇంపార్టెన్స్ పెంచడం…?*
అలా ఏం లేదండీ. రోల్ నచ్చడంతో నేను చేశా. ఆ పాత్రకు నేను అయితే బావుంటుందని అతను తీసుకున్నాడు. నా స్నేహితుడు నన్ను బాగా చూపిస్తాడనే నమ్మకంతో సినిమా చేశా. (నవ్వుతూ…) నటుడిగా నేను బాగా చేస్తే పెంచవచ్చు. సినిమా వరకూ మేమిద్దరం… నటుడు, దర్శకుడు. అంతే! నా కాస్ట్యూమ్స్, లుక్ పరంగా కేర్ తీసుకున్నాడు.
*ప్రశ్న: రెమ్యునరేషన్ ఎక్కువ ఇప్పించారట!*
అటువంటివి చెప్పకూడదు (నవ్వులు). అయితే… మా నిర్మాత ’88’ రామారెడ్డి గారు, సమర్పకులు ఆదిరెడ్డి .టి సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడికి కావాల్సింది ఇచ్చి బాగా తీశారు.
*ప్రశ్న: లాక్‌డౌన్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘ఇందువదన…’ కవర్ సాంగ్ చేశారు. అది చూసి చిరంజీవి ప్రశంసించారు. ఎలా అనిపించింది?*
అవునండీ. లాక్‌డౌన్‌లో ఏదో ఒకటి చేయాలని చేశా. మొత్తం అమెరికాలో షూటింగ్ చేశాం. అది చూసి చిరంజీవిగారు వాయిస్ మెసేజ్ పంపించారు. ‘ఇండియా వచ్చినప్పుడు కలుస్తా’ అని మెసేజ్ చేశా. సరేననన్నారు. ఇండియా వచ్చాక… ఈ ఏడాది న్యూ ఇయర్ మెసేజ్ చేశా. వెంటనే రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ డే మేనేజర్ కాల్ చేసి… సండే అపాయింట్మెంట్ ఇచ్చారు. సాధారణంగా ఆయన ఆదివారం ఎవరినీ కలవరట. నా వైఫ్ అమెరికా వెళ్లిపోతుందేమోనని చిరంజీవిగారు కలిశారు. చాలా సంతోషం అనిపించింది. అదొక బ్యూటిఫుల్ మెమరీ.
*ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?*
హీరోగా ‘నారాయణ అండ్ కో’ చేస్తున్నాను. అందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తా. హీరోగా ‘జీడీ’ (గుండెల్లో దమ్ముంటే) అని మరో సినిమా చేస్తున్నాను. ఆర్మీకి వెళ్లాలని అనుకునే ఫ్ర‌స్టేటెడ్ యంగ్‌స్ట‌ర్‌ రోల్. ఆ కథ ఒక్క రాత్రిలో జరుగుతుంది. మరో సినిమా కూడా ఓకే అయ్యింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను. మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నా. యువ దర్శకులు నాకు తగ్గ కథలు రాస్తున్నారు. సుఖ మీడియా (SUKHA MEDIA)… పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశా. మంచి కథలు వస్తే మా భాగస్వామ్యంతో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేశా. అందులో నాకు జోడీగా ’30 వెడ్స్ 21′ ఫేమ్ అనన్య నటించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చేశారు. ‘గాలి సంపత్’ నిర్మాత సాయికృష్ణ ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఆ పాట విడుదల అవుతుంది.

Tags  

  • interview
  • latest tollywood news
  • sudhakar
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Animal Beauty: భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ప్రభాస్ తో యానిమల్ బ్యూటీ రొమాన్స్!

Animal Beauty: భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ప్రభాస్ తో యానిమల్ బ్యూటీ రొమాన్స్!

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' మూవీతో ఆకట్టుకున్నారు.

  • Janhvi Kapoor: జాన్వీ కపూర్ అప్పుడే పెళ్లికి సిద్ధమవుతోందా?

    Janhvi Kapoor: జాన్వీ కపూర్ అప్పుడే పెళ్లికి సిద్ధమవుతోందా?

  • Nani: లిప్ లాక్ సీన్స్ పై హీరో నాని రియాక్షన్

    Nani: లిప్ లాక్ సీన్స్ పై హీరో నాని రియాక్షన్

  • Varun Tej-Lavanya: హనీమూన్ కు వెళ్లిన వరుణ్, లావణ్య జంట.. చక్కర్లు కొడుతున్న ఫొటో

    Varun Tej-Lavanya: హనీమూన్ కు వెళ్లిన వరుణ్, లావణ్య జంట.. చక్కర్లు కొడుతున్న ఫొటో

  • Ram Gopal Varma: యానిమల్ అనేది ఒక సినిమా కాదు.. అది ఒక సోషల్ స్టేట్ మెంట్!

    Ram Gopal Varma: యానిమల్ అనేది ఒక సినిమా కాదు.. అది ఒక సోషల్ స్టేట్ మెంట్!

Latest News

  • Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు

  • Cm Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

  • Pragathi Bhavan : ప్రగతి భవన్ ముందున్న బారిగేట్లును తొలగిస్తున్న పోలీసులు

  • BRS Party: కదలరు, వదలరు.. నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు వీళ్లే!

  • Shooting At US University: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

Trending

    • 100 Websites Blocked : ‘పార్ట్ టైం జాబ్స్’ పేరుతో చీటింగ్.. 100 వెబ్‌సైట్స్ బ్లాక్

    • Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..

    • Vo5G : స్మార్ట్‌ఫోన్లలో మరో విప్లవం ‘వో5జీ’.. ఏమిటిది ?

    • Dog Temple : ఆలయంలో శునకానికి విగ్రహం.. ఎక్కడ ? ఎందుకు ?

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version