HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hero Sharwanand Says Families Come To The Theater And Appreciate

Sharwanand: ఫ్యామిలీస్ థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు!

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న శుక్రవారం నాడు విడుదలయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

  • Author : Balu J Date : 06-03-2022 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadavallu
Aadavallu

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న శుక్రవారం నాడు విడుదలయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం నాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, నేను చెప్పినట్లుగానే విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు. ఇంటిలోని మహిళలు కూడా చూసే సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీ తోనే సినిమాకు వచ్చారు. వచ్చే వారం కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముంది అన్నారు. ఈ సందర్భంగా తన పెండ్లి గురించి వివరిస్తూ, సినిమాలో చూపించినట్లుగా నా తల్లి ఖుష్బూ ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. కానీ మా అమ్మనాన్నలు నీకు నచ్చితే మేం మాట్లాడతాం అని చెప్పారని అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ, మేం విడుదలకు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జరిగింది. చాలా సంతోషంగా వుంది. నా కుటుంబసభ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. ఇది బాగోలేదని ఒక్కరూ కూడా అనడం నేను వినలేదు. మనింటిలో జరిగే కథలా వుంటుంది. మేం నవ్విస్తామని చెప్పాం. అలాగే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే వున్నారు. హ్యాపీగా చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారని అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెలుపుతూ, సహజంగా సినిమా విడుదలైతే ఒకటి, రెండు టిక్కెట్లు అడుగుతారు. కానీ నిన్న ఈ సినిమా విడుదలయినప్పుడు 10 టిక్కెట్లు కావాలని ఫోన్లు వచ్చాయి. చూసిన వారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ లో వున్న ట్విస్ట్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆదరిస్తున్న మహిళలకు, ప్రేక్షకులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మా వీధిలోని వారంతా కలిసి సినిమా చూశారు. `నేను శైలజ`తో కాకుండా ఈ సినిమా నీకు మంచి గుర్తింపు వచ్చిందనివారు తెలియజేయడం సంతోషంగా వుంది.` అన్నారు.

నటి రుచిత మాట్లాడుతూ, నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు.. మొదట ప్రవల్లిక పాత్ర చెప్పినప్పుడు చేయలేనేమో అని అనుకున్నా. కానీ నాచేత చేయించారు. శర్వానంద్, రష్మిక సెట్లో వుంటే అంతా సరదాగా వుంటుంది. ఇందులో నటించిన సీనియర్ నటీమణులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. నటి దీప్తి మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadavaallu Meeku Johaarlu
  • latest tollywood news
  • Rashmika Mandanna
  • sharwanand

Related News

Vijay Rashmika Sangeet ceremony

సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సందడి

Virosh Wedding  టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు, అంటే ఫిబ్రవర

    Latest News

    • ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం.. సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు!

    • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

    • Train Journey : జస్ట్ 2 గంటల్లో బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం

    • Konda Murali : కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు !! నెక్స్ట్ ఏం జరగబోతుందో ?

    • గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తినొచ్చా?

    Trending News

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

      • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

      • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd