Nani : హీరో నాని చాల పెద్ద తప్పు చేసాడు..ఫ్యాన్స్ అంత ఇదే మాట
Nani : 'మిరాయ్' సినిమా విడుదలైన తర్వాత మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయం తేజా సజ్జాకు మరింత స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. నాని వదులుకున్న కథ తేజాకు బాగా కలిసి వచ్చిందని
- By Sudheer Published Date - 08:30 AM, Mon - 15 September 25

‘మిరాయ్’ (Mirai) సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తేజా సజ్జ హీరోగా నటించి, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం కథ తొలుత నేచురల్ స్టార్ నాని వద్దకు వెళ్లిందని సమాచారం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మొదట నానికి ఈ కథను వినిపించగా, నాని దానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ నచ్చడంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది.
నాని (Nani) మరియు చిత్ర యూనిట్ మధ్య పారితోషికం విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నారని సినీ వర్గాల సమాచారం. అప్పటికి నాని స్టార్‌డమ్ వేరు, ఆయన డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండేది. దీంతో నిర్మాతలకు, నానికి మధ్య రెమ్యునరేషన్ విషయమై చర్చలు విఫలమయ్యాయని, అందుకే నాని ఈ సినిమాను వదులుకున్నారని అంటున్నారు. ఈ పరిణామంతో చిత్ర బృందం వేరే హీరో కోసం అన్వేషణ ప్రారంభించింది.
Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మరణం..!
ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన తేజా సజ్జాను సంప్రదించారు. కార్తీక్ చెప్పిన కథ తేజా సజ్జాకు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నారు. నాని వదులుకున్న ఈ ప్రాజెక్టు తేజా సజ్జాకు లభించడంతో ఆయన కెరీర్లో మరో ముఖ్యమైన సినిమాగా ‘మిరాయ్’ నిలిచిపోయింది. తేజా సజ్జా ‘హనుమాన్’ తర్వాత వెంటనే మరో భారీ ప్రాజెక్టులో నటించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
‘మిరాయ్’ సినిమా విడుదలైన తర్వాత మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయం తేజా సజ్జాకు మరింత స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. నాని వదులుకున్న కథ తేజాకు బాగా కలిసి వచ్చిందని, సరైన హీరోను ఎంచుకోవడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ అయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కోసారి కొన్ని ప్రాజెక్టులు కొంతమంది హీరోల కోసం మాత్రమే పుడతాయనేది నిజం అని ‘మిరాయ్’ మరోసారి నిరూపించిందని చెప్పవచ్చు.