Disappointed: ట్విటర్ ట్రెండింగ్‌లో “Disappointed”.. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏమిటి..?
'సలార్' టీజర్‌పై కొందరు అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో “డిసప్పాయింటెడ్' (Disappointed) అని ట్వీట్స్ చేస్తుండటంతో ట్రెండ్ అవుతోంది.
- By Gopichand Published Date - 01:07 PM, Thu - 6 July 23
Disappointed: ‘సలార్’ టీజర్‌పై కొందరు అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో “డిసప్పాయింటెడ్’ (Disappointed) అని ట్వీట్స్ చేస్తుండటంతో ట్రెండ్ అవుతోంది. ఇది టీజరా? లేక గ్లింప్స్ వీడియోనా? అని కామెంట్స్ చేస్తున్నారు. టీమ్ మాత్రం ‘సీజ్ ఫైర్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. ‘సీజ్ ఫైర్’ అంటే.. రెండు దేశాల మధ్య యుద్ధ సమయంలో తీవ్రమైన కాల్పులు జరిగినప్పుడు శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపయోగించే పేరు అని తెలుస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రలో ‘సలార్’ ఒక్కటి. ఇక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట పాజిటివ్ రాగా.. తర్వాత నెగిటివ్ కూడా మొదలైంది. సలార్ టీజర్ ను కేజీఎఫ్ 2 టీజర్ తో పోలుస్తూ కేజీఎఫ్ 2 టీజర్ బెటర్ అనిపిస్తుంది అంటూ ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు అభిమానులు మాత్రం సలార్ టీజర్ విషయంలో అసంతృప్తికి లోనవుతున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఎంట్రీతో ఇన్‌స్టా షేక్.. 2 మిలియన్ల ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్!
సలార్ టీజర్లో కనిపిస్తోన్న విజువల్స్, లొకేషన్స్ అన్ని కేజీఎఫ్ 2ను పోలి ఉందని కామెంట్స్ చేస్తోన్నారు. ప్రశాంత్ నీల్‌ను ఈ విషయంలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కేవలం నాలుగు గంటల్లోనే పది మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా కేజీఎఫ్ -2 టీజర్ రికార్డులను సలార్ టీజర్ దాటేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తోన్నారు. కాగా సెప్టెంబర్ 28న సలార్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తోన్నాడు. శృతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా టీజర్ వచ్చింది. గురువారం ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్ రిలీజైంది.
Related News
Prabhas: తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ సాయం.. రూ.35 లక్షల విరాళం అందజేత
Prabhas: సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. సినిమా నటులకే కాకుండా తన స్నేహితులకు ఆపన్నహస్తం అందిస్తుంటాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇక చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్ట