Hebah Patel Photoshoot : కుమారి అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్.. హెబ్భా గ్లామర్ ట్రీట్ అదుర్స్..!
Hebah Patel Photoshoot కుమారి 21F బ్యూటీ హెబ్భా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు. అలా ఎలాతో ఎంట్రీ ఇచ్చి సుకుమార్ దృష్టిలో పడిన అమ్మడు
- Author : Ramesh
Date : 03-05-2024 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
Hebah Patel Photoshoot కుమారి 21F బ్యూటీ హెబ్భా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు. అలా ఎలాతో ఎంట్రీ ఇచ్చి సుకుమార్ దృష్టిలో పడిన అమ్మడు కుమారి 21F తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది హెబ్భా పటేల్. అయినా కూడా తన మార్క్ సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తుంది.
హెబ్భా పటేల్ ఇప్పటికీ ఆడియన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. హెబ్భా లోని గ్లామర్ యాంగిల్ కొన్నాళ్లు ఆమెకు అవకాశాలు తెచ్చి పెట్టింది.
ఇప్పటికి కూడా ఆడియన్స్ ని తన అందాల మత్తులో పడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది అమ్మడు. హెబ్భా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఛాన్సులు ఎలాగు పెద్దగా రావట్లేదు అని హెబ్భా పటేల్ ఫోటో షూట్స్ తో హాట్ అప్పీల్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు చేసిన గ్లామర్ షోకి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.
తనలా అందాలను ప్రదర్శించడం మరెవరికి సాధ్యం కాదనిపించేలా హెబ్భా పటేల్ అదరగొట్టేస్తుంది. హెబ్భా మార్క్ గ్లామర్ షో ఫాలోవర్స్ ని పిచ్చెక్కించేస్తుంది. హెబ్భా పటేల్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో ఓదెల 2 లో కూడా ఛాన్స్ అందుకుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, క్యామియో రోల్ ఎలాంటి పాత్ర ఇచ్చినా నో అనకుండా చేస్తుంది అమ్మడు. హెబ్భా పటేల్ గ్లామర్ షో ఆమెకు మైలేజ్ పెంచేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Rajamouli Mahesh : రాజమౌళి మహేష్.. 15 ఏళ్ల క్రితమే చేయాల్సిందా..?