Sunny Leone: అయ్యో సన్నీ లియోన్.. వర్షాల్లో కొట్టుకుపోయిన 3 ఖరీదైన కార్లు!
భారీ వర్షాలు సెలబ్రిటీలను సైతం దెబ్బతిశాయి. వరదల కారణంగా సన్నీ లియోన్ కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
- Author : Balu J
Date : 10-08-2023 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కురిసిన వర్షాలకు నార్త్ ఇండియా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రధాన నగరమైన ముంబై సైతం జలమయమై భారీ స్థాయిలో నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సెక్సీ తార సన్నీ లియోన్ ఇటీవల తన మనోభావాలను పంచుకుంది. “నేను వర్షాలను ఆరాధిస్తాను, కానీ నేను బయట అడుగు పెట్టనవసరం లేనప్పుడు మాత్రమే. నేను మొదట్లో సినీ అవకాశాల కోసం ఇండియాకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు, నేను ముంబైలో, సముద్రానికి చాలా దగ్గరగా ఉండేదాన్ని. అక్కడి బీచ్ వాతావరణం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ భారీ వర్షాల రూపంలో ఇంత ప్రళయం ఆకాశం నుండి దిగుతుందని నాకు తెలియదు!
వర్షాల కారణంగా నా నివాస స్థలం కూడా దెబ్బతింది. నా ఇంట్లోని వస్తువులు కూడా పాడయ్యాయి. అయినప్పటికీ, నేను వాతావరణాన్ని ఆస్వాదించాను! మాన్‌సూన్ సీజన్ నాకు ఇష్టమైంది. ఇది చల్లదనాన్ని తెస్తుంది. వర్షపు చినుకుల శబ్దం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే నేను వర్షాకాలం కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. భారీ వర్షాల కు నా కార్లు కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. వాటిలో రెండు ఒకే రోజు ధ్వంసమయ్యాయి.
భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్ల కోసం చెల్లించే గణనీయమైన పన్నులను పరిగణనలోకి తీసుకుంటే నేను చాలా బాధపడ్డాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. అందులో ఎనిమిది సీట్లు ఉండే మెర్సిడెస్ ట్రక్ ఒకటి. వర్షాకాలంలో నా పిల్లలు ఎంతో సరదాగా ఆడుకున్నారు’’ తన వాన కష్టాలను షేర్ చేసుకుంది.
Also Read: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలర్ట్, విజిటర్స్ కు నో ఎంట్రీ