Udaya Bhanu: ఉదయభాను కొత్తింటి వీడియోని చూశారా.. ఎంత అందంగా ఉందో?
ఉదయభాను అనగానే తెలుగు ప్రేక్షకులు ఇట్టాగే గుర్తుపట్టేస్తారు.
- By Anshu Published Date - 07:02 PM, Sun - 30 April 23

Udaya Bhanu: ఉదయభాను అనగానే తెలుగు ప్రేక్షకులు ఇట్టాగే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా ఓ రేంజ్ లో హడావుడి చేసింది. అప్పట్లో అన్ని షోలల్లో ఉదయభాను హవానే ఉండేది. ప్రతి ఒక్కరితో సరదాగా ఉండేది ఉదయభాను. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అందం పరంగా కూడా జూనియర్ శ్రీదేవి అని పేరు కూడా తెచ్చుకుంది.
కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై నటించింది.
ఇక పెళ్లి చేసుకుని ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఫ్యామిలీ బాధ్యతలు చేపట్టింది. ఇక ఈ మధ్యనే ఆమె మరోసారి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంది ఉదయభాను.
ఎప్పటికప్పుడు తన ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. తన పిల్లల వీడియోలు కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఈమె ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు అనిపించలేదు. చీర కట్టిన, డ్రెస్ వేసిన చాలా అందంగా, అనుకుగా కనిపించేది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మోటివేషనల్ మెసేజెస్ కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఇక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా న్యూ హోమ్ టూర్ అంటూ మరో వీడియో షేర్ చేసుకుంది. రీసెంట్ గా తను కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగా దానికి సంబంధించిన వీడియో మొత్తం చూపించింది. తన ఇల్లంతా విశాలవంతమైన గదులతో.. రిచ్ లుక్ తో కనిపించింది. ముఖ్యంగా ఫర్నిచర్ సెట్ మాత్రం బాగా అదిరిపోయింది అని చెప్పాలి. ఇక ఇల్లంతా ఎక్కడికి అక్కడ ప్యాక్ చేసి ఉండిపోగా ప్రస్తుతం ఆ వీడియో జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియో చూసి తన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు