HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hari Hara Veera Mallu Team Confirmed

Pawan Kalyan : పవన్ అభిమానులు అనుకున్నదే జరిగింది

Pawan Kalyan : ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తూ జూన్ 12న విడుదల చేయలేకపోతున్నామని (Harihara Veera Mallu Postponed) స్పష్టం చేశారు

  • Author : Sudheer Date : 06-06-2025 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ మరియు నిధి అగర్వాల్ (Pawan Kalyan – Nidhi Agarwal) జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veera Mallu) ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకుంటూ చివరకు మళ్లీ వాయిదా పడింది. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొదట రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి భాగమైన ‘స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ జూన్ 12న విడుదలవుతుందన్న ప్రకటనతో అభిమానుల్లో ఆశలు పెరిగినా, చివరికి మళ్లీ నిరాశే మిగిలింది. ippatik సినిమా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వంటివి ఆలస్యం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తూ జూన్ 12న విడుదల చేయలేకపోతున్నామని (Harihara Veera Mallu Postponed) స్పష్టం చేశారు. సినిమాను అత్యుత్తమంగా అందించాలనే లక్ష్యంతో కొంత మరింత సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. “పవన్ కళ్యాణ్ నటనకు తగిన నాణ్యతతో సినిమా రూపొందించడమే మా లక్ష్యం. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇంకొంత సమయం అవసరం. కానీ, మీ ప్రేమకు ప్రతిఫలంగా గొప్ప చిత్రాన్ని అందిస్తాం” అని చెప్పడం ద్వారా అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేశారు.

Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు

అయితే ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. మూడేళ్లుగా ఈ సినిమాను ఎదురు చూస్తున్నామని, మళ్లీ వాయిదాతో ఆశలన్నీ నాశనమవుతున్నాయని అంటున్నారు. పైగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించకపోవడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జులై 4న విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా విడుదల కావడంతో మరోసారి రిలీజ్ క్లాష్ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ‘వీరమల్లు’ భవితవ్యం ఏమైపోతుందో? అన్నది అభిమానుల్లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu New Release Date
  • Hari Hara Veera Mallu postponed
  • Harihara Veera Mallu
  • Pawan Kalyan

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd