Chiranjeevi : ‘విశ్వంభర’ లో హనుమాన్ సాంగ్ హైలైట్
మెగాస్టార్ చిరంజీవి 'హనుమాన్' భక్తుడు అనే సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాల్లో హనుమాన్ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి
- By Sudheer Published Date - 04:11 PM, Sun - 21 July 24

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకు వస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే పలు అప్డేట్స్ రాగా..తాజాగా ఈ సినిమాలో హైలైట్ గా నిలువబోయే హనుమాన్ సాంగ్ గురించి ఓ వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మెగాస్టార్ చిరంజీవి ‘హనుమాన్’ భక్తుడు అనే సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాల్లో హనుమాన్ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో చేసిన ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’లో హనుమాన్ పై ఓ పాటే పెట్టడం జరిగింది. ఈ సాంగ్ సినిమాలో హైలైట్ నిలువడమే కాదు సినిమా కథనే మార్చేలా ఉంటుంది. ఇప్పుడు `విశ్వంభర`లోనూ హనుమాన్ ఫై ఓ పాట ను సెట్ చేశారట. ఈ పాట ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ చెపుతున్నారు. కీరవాణి ఈ సాంగ్ కు చక్కటి బాణాలు అందించడరని..చెపుతున్నారు. ఈ పాటని త్వరలోనే విడుదల చేయాలనీ మేకర్స్ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా కోసమే 40 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్లో ప్రతిష్టించారు. ‘విశ్వంభర’ కాన్సెప్ట్ టీజర్‌లోనూ ఆంజనేయుడి విగ్రహం కనిపిస్తుంది. కథ లో ఆ విగ్రహం ఓ కీలక పాత్ర పోషించబోతుందని అంటున్నారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటె ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు అంతకన్నా మెగా గిఫ్ట్ మరోటి ఉండదు.
Read Also : Jagan : జగన్ కు ఉన్నది బిఆర్ఎస్ ఎంపీలేనా..?