Jagan : జగన్ కు ఉన్నది బిఆర్ఎస్ ఎంపీలేనా..?
జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తానని.. అనంతరం ప్రధాని మోడీ (PM Modi)ని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 03:51 PM, Sun - 21 July 24

ఇద్దరు మాజీ సీఎం లు జగన్ (Jagan) – కేసీఆర్ (KCR) లకు మధ్య మెచ్చి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఇరువురు సపోర్ట్ చేసుకుంటుంటారు. అలాగే కేసీఆర్ తో జగన్ నిత్యం టచ్ లో ఉంటారు. ఒకరి బాగోగులు..ఒకరు మాట్లాడుకుంటూ రాజకీయాల విషయాల గురించి చర్చించుకుంటారు. అంతే ఎందుకు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రపంచం మొత్తం కోడైకూసినా..కేసీఆర్ , కేటీఆర్ లు మాత్రం జగన్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నాడని చెప్పి ..జగన్ఫై తమకున్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పారు. అలాంటి ఇరు నేతలు ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ ఎంపీల సపోర్ట్ ను జగన్ కోరుకోవాల్సి వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
కూటమి సర్కార్ (AP NDA) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా (Jagan Dharna) చేయనున్నట్లు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తానని.. అనంతరం ప్రధాని మోడీ (PM Modi)ని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ ధర్నాకు వైసీపీ ఎంపీ లు తప్ప మిగతా ఏ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేయని పరిస్థితి నెలకొంది. NDA కూటమి ఫై పోరాటం చేస్తా అంటున్న జగన్ కు బిజెపి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు..ఇక కాంగ్రెస్ ఎంపీలు ఎలాగుచేయరు. మిగతా పార్టీ లు NDA ను కాదని చేయడం..అది కూడా జగన్ కు చేయడం అసత్యం. సో ఇక జగన్ మిగిలింది బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. మరి వారు సపోర్ట్ చేస్తారా..? స్వయంగా జగన్ కు సపోర్ట్ చేయాలనీ వారికీ లేకపోయినా..ఒకవేళ కేసీఆర్ ఏమైనా చెపితే వారు చేయాల్సి వస్తుంది. మరి వారు చేస్తారా లేదా అనేది చూడాలి.
Read Also : Margani Bharat : మార్గాని భరత్..జగన్ ను అంత మాట అనేశాడేంటి భయ్యా..!!