Guntur Kaaram : క్రిస్మస్ సందర్బంగా గుంటూరు కారం నుండి సరికొత్త పోస్టర్
- By Sudheer Published Date - 12:25 PM, Mon - 25 December 23

క్రిస్మస్ (Christmas) సందర్బంగా దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సామాన్యులతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తూ… క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే క్రిస్మస్ వేడుకలను పలువురు సినీ స్టార్స్ గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఇదే తరుణంలో పలు సినిమాల తాలూకా పోస్టర్స్ ను రిలీజ్ చేసి అభిమానులను సంతోష పెడుతున్నారు. తాజాగా గుంటూరు కారం (Guntur Kaaram) నుండి సరికొత్త పోస్టర్ ను క్రిస్మస్ సందర్బంగా రిలీజ్ చేసారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా క్రిస్మస్ సందర్బంగా స్పెషల్ పోస్టర్‌లో రిలీజ్ చేయగా..అందులో క్లాస్ లుక్ లో మహేష్ కనిపించారు. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరీ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Read Also : KCR: నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి