Gummadi Venkateswara Rao : సింగపూర్ పోలీసుస్టేషన్‌లో.. చెంపలు వాయించుకోని జరిమానా కట్టిన నటుడు గుమ్మడి..
గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితంలో ఫస్ట్ టైం సింగపూర్(Singapore) వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మడి చేసిన ఒక పనికి పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తీసుకు వెళ్లారు.
- By News Desk Published Date - 09:00 PM, Sat - 21 October 23

టాలీవుడ్ సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు(Gummadi Venkateswara Rao).. తన విలక్షణ నటనతో తెలుగు తెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న గుమ్మడి.. తండ్రిగా, తాతగా, విలన్‌గా నటించి మెప్పించారు. సాంఘికమైనా, పౌరాణికమైనా ఆ పాత్రల్లో ఇట్టే ఇమిడిపోయేవారు. నటుడిగానే కాదు రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా కూడా సినీ కళామతల్లికి సేవలు అందించారు.
2010లో 82 ఏళ్ళ వయసులో ఈయన మరణించారు. కాగా ఈయన జీవితంలో ఫస్ట్ టైం సింగపూర్(Singapore) వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మడి చేసిన ఒక పనికి పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తీసుకు వెళ్లారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో గుమ్మడి చెంపలు వాయించుకోని జరిమానా కట్టి బయటకి వచ్చారంట. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్బాల్లో తెలియజేశారు.
సింగపూర్ ప్రదేశాలను, వారి డెవలప్మెంట్‌ని, పరిశుభ్రతని చూసి గుమ్మడి ఆశ్చర్యపోయారట. అక్కడ ఉన్న సమయంలో కారులో ఒకసారి బయటకి వెళ్లిరంటా. గుమ్మడికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. కారులో సిగరెట్ తాగుతూ, ఏదో ఆలోచిస్తూ.. అలవాటులో పొరపాటుగా సిగరెట్ ని అరిపేసి రోడ్డు మీద పడేశారు. ఆ తరువాత కొంతం దూరం వెళ్లారో లేదో, వారి కారుకి ఒక పోలీస్ కారు అడ్డుపడి.. సిగరెట్ రోడ్డు మీద వేసింది ఎవరు? అని ప్రశ్నించారట.
గుమ్మడి అని తెలుసుకొని ఆయనని పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లారు. అయితే ఆయన దేశానికీ కొత్తవాడని తెలిసి.. శిక్ష వేయకుండా 500 డాలర్లు జరిమానా వేశారంట. సిగరెట్ రోడ్డు మీద వేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణించిన ఆ దేశ పద్దతి, తన సిగరెట్ పడేసిన విషయం ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసులు తెలుసుకొనే వారి టెక్నాలజీ చూసి.. తన రెండు చెంపలు వాయించుకొని జరిమానా కట్టారంట.
Also Read : Chiranjeevi : ఆ కారణంతో ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాల్లో.. చిరంజీవికి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు..