Gopichand: ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు.. డైరెక్టర్ తేజ ని ప్రశ్నించిన గోపీచంద్?
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ తాజాగా నటించిన సినిమా రామబాణం. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా
- Author : Anshu
Date : 25-04-2023 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ తాజాగా నటించిన సినిమా రామబాణం. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరో గోపీచంద్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు గోపీచంద్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ ని తేజ ప్రశ్నిస్తూ.. ఈ సినిమా పేరు రామబాణం బాలకృష్ణ తో అనౌన్స్ చేయించారు. ఆయనతోనే ఎందుకు అనౌన్స్ చేయించారు అని ప్రశ్నించగా.. దానికి కూల్ గా సమాధానం చెప్పారు గోపీచంద్. శ్రీవాస్ కు నీకు మధ్య గొడవలు అంట కదా అని ప్రశ్నించగా.. దానికి కూడా నవ్వుతూ సమాధానం తెలిపారు.
Honest Talks & Frankful confessions 🤞
Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru 🤩
FULL INTERVIEW TOMORROW 💥#RamaBanam #RamabanamOnMay5 🏹 pic.twitter.com/R6yaEgRPUL
— People Media Factory (@peoplemediafcy) April 25, 2023
ఆ తర్వాత నాతో సినిమా ఒప్పుకున్నావు హీరోయిన్ సెట్ అవ్వలేదు హీరోయిన్ ను సెట్ చేద్దామనుకున్నలోపే నన్ను పక్కన పెట్టి వేరే వారితో సినిమా ఓకే చేశావు. కనీసం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని గోపీచంద్ ని ప్రశ్నించగా.. చేసింది తప్పే అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు గోపిచంద్. అనంతరం గోపీచంద్ తేజని ప్రశ్నిస్తూ.. ఎందుకు సినిమాలకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు అని ప్రశ్నించగా.. నేను వెళ్లి ఇంతవరకు మీతో ఈ సినిమా చేస్తాను అని ఎవరిని అడగను అని చెప్పుకొచ్చారు తేజ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.