Rajinikanth : తలైవా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో రజనీ డిశ్చార్జ్!
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత బాగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆసుపత్రి తెలిపింది.
- By Balu J Published Date - 03:22 PM, Fri - 29 October 21

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత బాగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆసుపత్రి తెలిపింది. కొన్ని రోజుల తర్వాత సూపర్ స్టార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో వైద్యుల నిపుణుల బృందం అతనిని పరీక్షించి కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకోవాలని సూచించడంతో రజనీకి సర్జరీ పూర్తి అయ్యింది.
మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ చికిత్స పొందుతున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నటుడి అభిమానులు గుమిగూడకుండా, ప్రాంగణంలోకి ప్రవేశించకుండా చూసేందుకు పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. దాదాపు 30 మంది పోలీసులు ఆసుపత్రిలో వద్ద ఉన్నారు.
రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్లో బీపీ పెరగడం వల్ల హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే చిత్రబృందం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. దీంతో రెండు రోజుల్లో ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత తనకు ఆరోగ్యం సహకరించడంలేదంటూ పార్టీ ని స్థాపించడంలేదని ఆయన ప్రకటించారు.ఇది భగవంతుడు నాకు ఇచ్చిన హెచ్చరికగా తాను భావిస్తున్నానని…పార్టీని ప్రారంభించిన తర్వాత మీడియా, సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే రాజకీయాల్లో రాణించలేనని ఆయన తెలిపారు.
Related News

Big B-Rajinikanth: 32 ఏళ్ల ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిశారు!
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ చివరిగా 1991లో ఫ్యామిలీ డ్రామా "హమ్"లో స్క్రీన్‌ను పంచుకున్నారు.